YS Jagan Press Meet: ప్రజా ప్రతినిధులు అంటే ప్రజాస్వామ్యానికి వారధులు. చట్టసభల్లో ప్రజల తరఫున వాదనలు వినిపించేందుకు వారిని ఎన్నుకుంటారు. కానీ ఏపీలో మాత్రం ప్రజాప్రతినిధులు అంటే వారు ప్రజల తరఫున వాదనలు వినిపించేలా లేరు. తమకు హోదా ఇస్తేనే ప్రజల తరుపున గళం వినిపిస్తామని చెబుతున్నారు. అది సాధ్యం కాకపోయేసరికి వారాంతపు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ప్రజల తరుపున వాదనలు కాకుండా.. తమ తప్పులను సమర్థించేందుకే సమయం కేటాయిస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అని అందరికీ అర్థం అయిపోతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. సభను బహిష్కరించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
* బెంగళూరు వెళ్లే ముందు..
వారంలో నాలుగు రోజులపాటు బెంగళూరులో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి.. ఓ మూడు రోజులు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కు కేటాయిస్తున్నారు. బెంగళూరు వెళ్లే ముందు ఓ రెండు మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు. వీడియోను టెలికాస్ట్ చేశారు. లైవ్ అని నమ్మించేందుకు ఎప్పుడు లేని విధంగా ఆయన ముందు చానళ్ల మైకులు పెట్టారు. ఈ వారాంతపు కామెంట్స్ ఏమిటంటే బడ్జెట్ పై జగన్మోహన్ రెడ్డి విశ్లేషణ చేశారు. డేటా మైనింగ్ గ్రాపులతో విశ్లేషణ చేయడం ఆకట్టుకుంది. జీఎస్టీపి గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబుపై ఎన్నో రకాల విమర్శలు చేశారు.. పెన్షన్లు తొలగిస్తారని.. పథకాలు అమలు చేయడం లేదని.. ఇలా లేనిపోని ఆరోపణలు చేశారు. అయితే ఒక్కటంటే ఒక్క దానిపై కూడా ఫుల్ క్లారిటీ తో మాట్లాడలేదు.
* విమాన ఖర్చులు విషయంలో..
చంద్రబాబు మాత్రమే కాదు లోకేష్ పై కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇటీవల కొలంబోలో పాకిస్తాన్ తో ఇండియా క్రికెట్ మ్యాచ్ ను తిలకించారు లోకేష్. గ్రౌండ్లో భారత జాతీయ జెండాతో లోకేష్ హల్చల్ చేయడం నేషనల్ మీడియాలో సైతం వచ్చింది. అయితే ప్రభుత్వ ఖర్చుతో లోకేష్ వెళ్లారని.. డబ్బులు ఇచ్చి నేషనల్ మీడియాలో రాయించుకున్నారని ఏవేవో ఆరోపణలు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ అబద్ధమని తేల్చింది. అయినా సరే లోకేష్ పై నిన్న జగన్ విమర్శలు చేశారు.. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రైవేట్ విమానం వేసుకొని కొలంబో వెళ్లాలా? టీవీలో కనిపించదా అని ప్రశ్నించేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లు విమానం హెలికాప్టర్లలో జల్సాగా గాల్లో తిరుగుతున్నారని విమర్శలు చేశారు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ చిన్న అవసరానికి అయినా హెలిక్యాప్టర్ లేనిదే బయటకు అడుగు పెట్టేవారు కాదు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేయడం ఏంటనేది సొంత పార్టీ శ్రేణులకు కూడా మింగుడు పడడం లేదు. ఈ వారాంతపు ప్రెస్ మీట్ బదులు ఇవేవో సభలోకి వెళ్లి ప్రశ్నించవచ్చు కదా అని ఎక్కువ మంది సూచిస్తున్నారు.