Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: జగన్ కు కొత్త ఫ్యామిలీ చిక్కు

YS Jagan Mohan Reddy: జగన్ కు కొత్త ఫ్యామిలీ చిక్కు

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) కుటుంబ సభ్యులు చికాకు పెడుతున్నారు. ఇప్పటికే తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఆయనకు దూరమయ్యారు. మరో చెల్లెలు సునీత అయితే బద్ద విరోధిగా మారిపోయారు. వైయస్ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. దాని ప్రభావం పులివెందులతో పాటు కడపలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఐక్యత తేవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది. కానీ ఇప్పుడు కుటుంబంలో కొత్త వివాదం రేగినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు కడప పొలిటికల్ సర్కిల్లో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పి వ్యవహారం.

* జిల్లా పగ్గాలు..
కడపలో( Kadapa) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది మొన్నటి ఎన్నికల్లో. 2014లో ఒక్క సీటు తప్పించి మిగతా చోట్ల వైసీపీ గెలిచింది. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2024లో మాత్రం కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కడప తో పాటు రాజంపేట పార్లమెంట్ సీట్లతో పరువు దక్కించుకుంది. అయితే కడప జిల్లాలో మళ్లీ పార్టీ పునర్నిర్మాణం జరగాలని భావించి జగన్మోహన్ రెడ్డి తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కడప జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. కానీ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం అవినాష్ రెడ్డిని కనీస స్థాయిలో కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అంతా తానే అన్నట్టు ఆయన సీన్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

* కడప పై ఫోకస్..
2019 ఎన్నికల్లో కమలాపురం ( kamalapuram) నుంచి గెలిచారు రవీంద్రనాథ్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో అక్కడ నుంచి రెండోసారి బరిలో దిగి ఓడిపోయారు. అయితే ఈసారి కడప నగరంపై దృష్టి పెట్టారు రవీంద్రనాథ్ రెడ్డి. అయితే అది ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం. అక్కడ డిప్యూటీ సీఎం గా పదవి చేపట్టిన అంజాద్ బాషా ఉన్నారు. ఆపై మేయర్ సురేష్ బాబు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డి వైఖరితో వారిద్దరూ ఆగ్రహంగా ఉన్నారు. వారు అవినాష్ రెడ్డి తో స్నేహం చేస్తున్నారు. దీంతో ఇది రవీంద్రనాథ్ రెడ్డికి నచ్చడం లేదు. అవినాష్ తో బాహటంగానే విభేదిస్తున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది.

* చులకనగా మాట్లాడుతున్న రవీంద్రనాథ్ రెడ్డి..
అవినాష్ రెడ్డి విషయంలో రవీంద్రనాథ్ రెడ్డి ( Ravindranath ready )చాలా తేలిగ్గా మాట్లాడుతున్నట్లు సమాచారం. అవినాష్ తీరుతోనే కడపలో వైయస్సార్ కుటుంబం బలహీన పడిందని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఎటూ చెప్పలేకపోతున్నారు. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఏమైనా అంటే ఆయన కచ్చితంగా పార్టీకి గుడ్ బై చెప్పి షర్మిల చెంతకు చేరుతారు. అదే జరిగితే పొలిటికల్ గా మరింత డ్యామేజ్ ఖాయం. అందుకే చాలా కూల్ గా దీనిని డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular