Jagan: ఒకప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి మూల స్తంభం. పార్టీతో పాటు అధినేత కోసం గట్టిగానే నిలబడే వారు. అయితే ఆయన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలింది. అందుకే ఆ పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరయ్యారు. వైసీపీలో లేని గౌరవం ఇప్పుడు దక్కించుకున్నారు. అయితే తనకు ఆయన దూరం కావడం ద్వారా జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. పైగా అదే వ్యక్తి పై విమర్శలు చేయడంతో సదరు నేత మరింత మనస్థాపానికి గురయ్యారు. తన ప్రతాపం ఏమిటో చూపిస్తానని హెచ్చరికలు పంపారు. అయితే ఆయన ఎవరో కాదు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డికి వీర విధేయత చూపిన నేతల జాబితాలో వేమిరెడ్డి పేరు ఉంటుంది. అటువంటి నేతను దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
* టీటీడీ లడ్డు వివాదంలో..
టిటిడి లడ్డు వివాదంలో దొరికిపోయారు అప్పన్న అనే ఉద్యోగి. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(prabhakar reddy) వద్ద పనిచేసేవారని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలో వేమిరెడ్డి పై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ సైతం రంగంలోకి దిగి వేమిరెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇటీవల వరకు వేమిరెడ్డి తిరిగి వైసిపి లోకి వెళ్లి పోతారని ప్రచారం సాగింది. వైసీపీలో తగిన గౌరవం లేకపోవడంతోనే వేమిరెడ్డి టిడిపిలోకి వచ్చారు. తనపై అనిల్ కుమార్ యాదవ్ నోరు పారేసుకున్న జగన్ అడగలేదన్నది వేమిరెడ్డి ఆవేదన. పార్టీతో పాటు అధినేత కోసం పని చేస్తే తనను తక్కువ చేయడం పై ఆయన సహించుకోలేకపోయారు. అందుకే 2024 ఎన్నికలకు ముందు సైకిల్ ఎక్కారు. ఫ్యాన్ పార్టీకి దారుణమైన దెబ్బ తీశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి విషయంలో తప్పు జరిగింది అని పశ్చాత్తాప పడడం లేదు. పైగా వేమిరెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు.
* వ్యక్తిగతంగా డ్యామేజ్..
కొద్ది రోజుల కిందట వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పార్టీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి(prasannakumar reddy). అప్పట్లో కూడా చాలా రకాల వివాదాలు నడిచాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పై ఉన్న గౌరవం అభిమానంతో మాట్లాడలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు నేరుగా తననే టార్గెట్ చేసుకోవడానికి తట్టుకోలేకపోతున్నారు వేమిరెడ్డి. 2024 ఎన్నికలే కాదు 2029 ఎన్నికల్లో సైతం జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీస్తానని హెచ్చరిస్తున్నారు. ఒకసారి బాధిత వర్గంగా మారినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన ద్వారా నెల్లూరులో రాజకీయ స్వరూపమే మారిపోయింది. మెత్తగా తన దగ్గరకు తీసుకోవాల్సింది పోయి.. ఇప్పుడు అలా కఠినంగా మాట్లాడేసరికి వేమిరెడ్డి స్ట్రాంగ్ అవుతున్నారు. ఫలితంగా అది జగన్మోహన్ రెడ్డికి నష్టం. ఎందుకంటే 2014, 2019లో వేమిరెడ్డి లాంటివారు ఉండేసరికి నెల్లూరులో వైసిపి ఆధిపత్యం నడిచింది. 2024లో మాత్రం వేమిరెడ్డి లాంటి వారు బయటకు వెళ్లేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుంటే ఎలా మరి?