Komatireddy Rajagopal Reddy: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) విషయంలో తెలంగాణ నేతల వైఖరి మారుతోంది. గతంలో ఆయనను ఒక వ్యతిరేక భావనతో చూసేవారు. క్రమేపి ఆ భావన తగ్గుతోంది. చంద్రబాబు గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు తెలంగాణ నేతలు. అయితే ఈ పార్టీ వారు.. ఆ పార్టీ వారు అన్న తేడా లేదు. అన్ని పార్టీల నేతలు చంద్రబాబు విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన చేసిన కేసీఆర్ సహవాసంతో ఎక్కువమంది తెలంగాణ నేతలు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్ధులు అవుతున్నారు. ఇంతకాలం వ్యతిరేకించిన చంద్రబాబుకు సానుకూలంగా మారుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సాఫ్ట్ గా మాట్లాడారు చంద్రబాబు విషయంలో. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో విరుద్ధంగా స్పందించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* విరుద్ధ భావనలు..
తెలుగు రాష్ట్రాల్లో విరుద్ధ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇండియా కూటమి అది. రెండు రాష్ట్రాల్లో సిద్ధాంత పరంగా విభేదించే రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ రెండింటి మధ్య సానుకూలత ఉంది. అదే సమయంలో ఏపీలో టిడిపి కూటమికి ప్రత్యర్థిగా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కెసిఆర్. ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల పాలకుల మధ్య కూడా సహృద్భావ వాతావరణం ఉంది. అయితే ఇన్ని రోజులు రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని గౌరవించిన కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్ కేసీఆర్ తో చేస్తున్న స్నేహాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై ఉన్న ద్వేషాన్ని తగ్గించుకొని గౌరవించడం ప్రారంభించారు. పైగా కాంగ్రెస్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు విషయంలో గౌరవభావంతో ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాఫీగా ముందుకు వెళ్లడానికి చంద్రబాబు సహకారం ఉందన్నది ఒక బలమైన వాదన.
* మారుతున్న మంత్రుల వైఖరి..
మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ఇంట్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఆ కుటుంబం అన్న ఆయనకు చాలా గౌరవం. అయితే అటువంటి భట్టి విక్రమార్క చంద్రబాబు పట్ల ఇటీవల ఎంతో గౌరవభావంతో మెలుగుతున్నారు. ఆయన కుమారుడి పెండ్లికి వెళ్లలేని చంద్రబాబు తర్వాత ప్రత్యేకంగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు వద్దకు వెళ్లి ప్రత్యేకంగా చర్చించారు కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి( comatireddy Venkat Reddy) కూడా చంద్రబాబు విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చంద్రబాబు హార్డ్ వర్కర్ అని.. ఆయన చాలా ఆదర్శంగా ఉంటారని చెప్పారు. అయితే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విషయంలో మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన పెద్ద నటుడు అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
