Chandrababu – Netizens : ఇదేనా బాబు విజనరీ..తెగ ఆడేసుకుంటున్న నెటిజన్లు

తెలంగాణ సచివాలయం, ఇండియన్ పార్లమెంట్ భవనంతో పోలిక అనేసరికి అందరికీ ఇట్టే అర్ధమైపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written By: Dharma, Updated On : April 29, 2023 9:45 am
Follow us on

Chandrababu – Netizens : ‘డబ్బులు ఊరికే రావు కదా’! ఈ మధ్యన తెలుగునాట బాగా పాపులరయిన మాట ఇది. అన్ని పత్రికలు, టీవీల్లో నిగనిగలాడే బోడిగుండుతో ఒకాయన నిత్యం ఈ మాట చెబుతుంటాడు. ఒక్క యాడ్ తో ఆయన యాంకర్‌ సుమతో సమానమైన పాపులారిటీ తెచ్చుకోగలిగారు. తన వ్యాపారాన్ని పెంచుకో గలిగారు.  ఓన్ అండ్ ఓన్లీ సోలో ఫెర్ఫార్మెన్స్ తో లలిత జ్యూయలర్స్ ఎండీ బాగానే ఒడిసి పట్టుకున్నారు. తెలుగునాట ప్రాచుర్యం పొందారు. అయితే ఇటువంటి ప్రయత్నం చంద్రబాబు ఎనాడో చేశారు. తనను తాను ఓ విజనరీ నాయకుడిగా ఎల్లో మీడియా సహకారంతో చిత్రీకరించుకున్నారు. చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌గా భ్రమింపచేయడానికి ఎల్లో ముఠా చేయని ప్రయత్నం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కూడా లాబీయింగ్‌ చేసి మీడియా మేనేజ్‌మెంట్‌కు కూడా దిగజారారు. ఆయన్నొక విజనరీగా చిత్రించడానికి తెగ ఆరాటపడ్డారు. అందులో కొంతవరకూ సక్సెస్ అయ్యారు.

ఆ భవనాలతో పోలస్తూ..
అయితే తాజాగా చంద్రబాబు విజనరీ ఇదొంటూ సొషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. రూ.600 కోట్లతో నిర్మించి తెలంగాణ సచివాలయం, రూ.900 కోట్లతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాలకు పక్కనే… రూ.750 కోట్లతో ఏపీ తాత్కాలిక సచివాలయ భవనం అంటూ పెట్టిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే మన బాబుగారి విజనరీ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. దానినే వైరల్ చేస్తున్నారు. తరచూ విజనరీ నాయకుడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారని.. విజనరీ అంటే దుబారా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. దీనినే దోపిడీ విజనరీ అంటారని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. కరెక్ట్ టైమ్ లో పోస్టు పెట్టారని అభినందించిన వారూ ఉన్నారు.

గతంలోనే ఆరోపణలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక సచివాలయం నిర్మించారు. దీనికి రూ.750 ఖర్చు చేసినట్టు చూపారు. అయితే దీనిపై ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి. పెద్దఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపించింది. వర్షాకాలంలో సచివాలయం కారుతుండడాన్ని వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టింది. తాత్కాలికం అన్న పదంతో కాగ్ అజమాయిషి, ఆడిట్ ఉండదు. కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పని ఉండదంటూ విమర్శలు గుప్పించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను నాడు చేసిన ఆరోపణలు మరిచిపోయింది. అదే సచివాలయంలోనే పాలన కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పుడు చంద్రబాబు విజనరీతో పోలిక వెనక వైసీపీ సోషల్ మీడియా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ సచివాలయం, ఇండియన్ పార్లమెంట్ భవనంతో పోలిక అనేసరికి అందరికీ ఇట్టే అర్ధమైపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.