Conspiracy behind Kashibugga stampede: కాశీబుగ్గ( Kashi Bugga ) ఆలయ తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందా? ఒకేసారి 25వేల మంది భక్తులు రావడం ఏంటి? ఒక కొత్త ఆలయానికి ఇంత మంది ఒకేసారి రావడం సాధ్యమా? సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారా? అందుకే భారీగా భక్తులు వచ్చారా? అయితే ఆలయ నిర్వహకులు ఈ ప్రచారం కల్పించరా? లేకుంటే కృత్రిమంగా కొంతమంది చేయించారా? భక్తులు గంట గంటకు పెరుగుతున్నా.. సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల పంతులు వచ్చే ఆలయంలో ఒకేసారి.. భక్తులు పెరిగారు. మధ్యాహ్ననికి 20వేల మంది భక్తులు దాటారు. అటువంటప్పుడు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇప్పుడదే అనుమానం.
ఆ భారీ ప్రచారం చేసింది ఎవరు?
కాశీబుగ్గలో నాలుగేళ్ల కిందట ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 2023లో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. గత ఏడాది మేలో భక్తులకు దర్శనం ప్రారంభం అయింది. వెయ్యి మంది వరకు భక్తులు వస్తుండేవారు. పర్వదినాల్లో 3000 మంది వరకు వచ్చేవారు. అయితే ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలుపుతూ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా ఇన్ఫ్లుయెన్సర్లు భారీగా రంగంలోకి దిగారు. కొందరు వ్యూస్ కోసం ఈ వీడియోలు చేసినట్లు స్పష్టమౌతోంది. అయితే ఇటీవల భారీగా ప్రచారం జరిగింది ఈ ఆలయం పై. ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉంది ఈ ఆలయం. సాధారణ భక్తుల రద్దీ ఉంటుందని నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించలేదు. పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివచ్చారు. పక్కనే ఉన్న ఒడిస్సా నుంచి వచ్చిన వారు సైతం ఉన్నారు. నిర్వాహకులు ఎటువంటి ప్రచారం చేయలేదు. భక్తులు భారీగా వస్తారని అంచనా వేయలేదు. కానీ అనుకోని విధంగా ఈ ఘటన జరిగింది. నిర్వాహకులు ఊహించలేదు. తాము పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదని చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఎవరు అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
నిత్యం పొలిటికల్ హై టెన్షన్..
పలాసలో( Palasa) పొలిటికల్ హై టెన్షన్ ఉంటుంది. పేరుకే శ్రీకాకుళం జిల్లా కేంద్రం అయినా.. జిల్లా రాజకీయాలను శాసించగల శక్తి పలాసకు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిత్యం రాజకీయ వేడి ఉండేది. ఇక్కడ 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. సర్దార్ గౌతు లచ్చన్న మనుమరాలు, మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె శిరీష టిడిపి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఇదే శిరీషపై అప్పలరాజు గెలిచారు. మంత్రి అయిన తర్వాత దూకుడు ప్రదర్శించారు. ఆ దూకుడుకు వ్యతిరేకంగా శిరీష పావులు కదిపేవారు. ఈ క్రమంలో పొలిటికల్ వార్ సాగేది. 2024 ఎన్నికల్లో అదే అప్పలరాజును ఓడించారు గౌతు శిరీష. ఏకంగా 42 వేల ఓట్ల మెజారిటీతో ఓడించడంతో అప్పలరాజు దూకుడుకు కళ్లెం పడింది. 2024 ఎన్నికల తర్వాత పలాసలో ప్రశాంత వాతావరణం నెలకొంది. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలల అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే ముందుగా కొంతమంది రాజకీయ పార్టీల నేతలు చేరడం అనుమానాలకు తావిస్తోంది. క్షణాల వ్యవధిలో వారు ఎలా చేరారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే నిర్వాహకుడు హరి ముకుంద పండా మాత్రం ఇంతమంది భక్తులు వస్తారని తాను ఊహించలేదని.. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ అక్కడ కొంతమంది రాజకీయ పార్టీల నేతలు ప్రత్యక్షం కావడం మాత్రం కుట్ర కోణం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో సైతం ప్రచారం ప్రారంభం అయ్యింది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.