Homeఆంధ్రప్రదేశ్‌Haindava Sankharavam: హైందవ శంఖారావసభ అసలు లక్ష్యం అదేనా?

Haindava Sankharavam: హైందవ శంఖారావసభ అసలు లక్ష్యం అదేనా?

Haindava Sankharavam: దేశం చూపు ఏపీ( Andhra Pradesh) వైపు పడింది. విజయవాడలో విహెచ్పి ( Vishva Hindu Parishad) ఆధ్వర్యంలో హైందవ శంఖారావం సభ విజయవంతం అయ్యింది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి( National democratic allowance) ప్రభుత్వం ఉండడంతో ఈ సభ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందింది. దీంతో సభ సక్సెస్ అయ్యింది. దేశ నలుమూలల నుంచి మఠాధిపతులు, స్వామీజీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ రకంగా పునరంకితం కావాల్సిన అవసరం ఉన్నదో చర్చించారు. హిందూ ధార్మిక సంస్థలు, ఆలయాల్లో అన్య మతస్తులను ఉద్యోగులుగా నియమించకూడదు అన్న అంశం నుంచి.. హిందూ ఆలయాల నిర్వహణ హిందువుల చేతుల్లో ఉండాలని డిమాండ్ వరకు పలు తీర్మానాలు చేశారు ఈ సభలో.

* ప్రత్యేక అజెండా
ఒక ప్రత్యేక అజెండాతో( special agenda) హైందవ శంఖారావసభను నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి( individuality ) కల్పించాలనేది ఈ శంఖారావం ప్రధాన డిమాండ్ గా వినిపిస్తోంది. ఇప్పటికే అయోధ్యలో రామ మందిరం( Ayodhya Rama Mandiram ) నిర్వహణ పూర్తి స్వయం ప్రతిపత్తితో సాగుతోంది. దానిని ఆదర్శంగా తీసుకుని దేశంలో మిగతా ఆలయాలకు సైతం స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నది వారి డిమాండ్. బ్రిటిష్ కాలం నుంచే హిందూ దేవాలయాలపై వివక్ష కొనసాగిందని.. మిగతా మతాల సంగతి వదిలేసారని.. హిందూ దేవాలయాలపై మాత్రం ప్రభుత్వాల పెత్తనం కొనసాగించారని ఈ సందర్భంగా పీఠాధిపతులు గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నది ప్రధాన డిమాండ్. హిందూ ధర్మ రక్షణలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేలా తదుపరి కార్యాచరణ ఉండాలంటూ సభకు వచ్చిన వారితో చిన్న జీయర్ స్వామి( Chinna gear Swami) ప్రతిజ్ఞ చేయించడం విశేషం.

* రాజ్యాంగ సవరణల నేపథ్యంలో
జాతీయస్థాయిలో రాజ్యాంగ సవరణలు చేస్తారని ఒక ప్రచారం ఉంది. చట్టాలను మారుస్తారు అన్న టాక్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో హిందూ ఆలయాల నిర్వహణ మొత్తం ధార్మిక సంస్థల చేతుల్లోకి.. హిందూ పెద్దల చేతుల్లోకి వెళ్లాలని డిమాండ్ ఈ శంఖారావ సభ ద్వారా ప్రచారంలోకి రావడం విశేషం. ప్రస్తుతం బిజెపి( Bhartiya Janata Party) నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. దేశంలో మెజారిటీ రాష్ట్రాలు సైతం బిజెపి చేతుల్లోనే ఉన్నాయి. ఈ తరుణంలో బిజెపి అనుబంధ సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ ( Vishva Hindu Parishad ) నిర్వహించిన హిందూ శంఖారావసభలో ఈ సరికొత్త నినాదాలు బయటపడడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హిందూ సమాజం సైతం ఈ నినాదాలను అనుసరించే అవకాశం ఉంటుంది. అయితే ఆలయాల సంగతి పక్కన పెడితే.. ఇప్పటికే మఠాలు, పీఠాలు రూపంలో అనేక హిందూ సంస్థలు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. వాటికి లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఆస్తులు ఉన్నాయి. వాటి నిర్వహణపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి అంటే సాహసంతో కూడుకున్న పని. అయినా సరే ఇతర మతాలతో పోల్చుకుంటే.. హిందూ మతానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. మొత్తానికైతే హిందూ శంఖారావ సభ దేశానికి సరికొత్త నినాదాన్ని ఇచ్చినట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular