AP Investments: కూటమి 15 నెలల పాలనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అభ్యంతరం చెబుతోంది. అభివృద్ధి లేకపోగా.. ఉద్యోగాల కల్పన కూడా లేదని ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 15 నెలల కాలంలో రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టపరిచిందని.. కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. శాసనమండలిలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల గురించి మంత్రి లోకేష్ ఈ ప్రకటన చేశారు.
* జగన్ విమర్శలపై..
పరిశ్రమలకు తక్కువ ధరకే భూములు కేటాయించడానికి జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతున్నారు. దాని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఒక్క టిసిఎస్ తోనే విశాఖలో 25 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టిసిఎస్ తో ఏటా పదిహేను వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. దీని ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో 1500 కోట్ల ఆదాయం రానుంది. టిసిఎస్ లాంటి కంపెనీలు రాష్ట్రానికి చాలా ముఖ్యమని.. ఎంతోమంది జీవితాలు మారుతాయి అని నారా లోకేష్ అభిప్రాయ పడ్డారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు కూడా రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పుకొచ్చారు నారా లోకేష్.
* లోకేష్ ప్రసంగంలో వెల్లడించినవి ఇవే..
* రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 25 పాలసీలను తీసుకొచ్చింది.
* వివిధ సంస్థలతో 340 ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
* రూ.10.4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
* మరో మూడు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చర్చలు జరుగుతున్నాయి.
* అర్సలార్ మిత్తల్, బిపిసిఎల్, ఎన్ టి పి సి వంటి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతున్నాయి.
* టి సి ఎస్, కాగ్నిజెంట్, గూగుల్, ఎల్జి ఎలక్ట్రానిక్స్ వంటి ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి.
* ఆసియాలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఐబీఎం సమస్త ఏర్పాటు చేస్తోంది.
* రెన్యూ, టాటా పవర్, ప్రీమియర్ ఎనర్జీ వంటి విద్యుత్ సంస్థలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయి.