Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao Vs AP CM YS Jagan : పెట్టుబడులు పెడితే దుర్మార్గమా... ఇదేంటి...

Ramoji Rao Vs AP CM YS Jagan : పెట్టుబడులు పెడితే దుర్మార్గమా… ఇదేంటి రామోజీ! 

Ramoji Rao Vs AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఏ బహిరంగ సభ పెట్టినా.. మూడు మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తనకు అండగా లేకపోయినా ఉన్నది ఉన్నట్లు చూపడం లేదని విమర్శిస్తున్నారు. టీడీపీకి కొమ్ముకాస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 పై బహిరంగ వేదికలపైనే ప్రకటిస్తున్నారు. ఆయా మీడియా సంస్థలు కూడా వీటిని ఖండించడం లేదు. పైగా జగన్‌ ఏం చేసినా అందులో లోపాలు వెతకి, పెద్దపెద్ద శీర్షికలతో కథనాలు వండి వారుస్తున్నాయి. దీంతో జగన్‌ చేసిన ఆరోపణల్లో నిజం ఉందన్న భావన ఆంధ్రా ప్రజల్లో వ్యక్తమవుతోంది. తాజాగా ఈనాడు ఏపీకి వచ్చిన పెట్టుబడులను కూడా దుర్మార్గంగా అభివర్ణించడం చర్చనీయాంశమైంది.

80 వేల కోట్ల పెట్టుబడులు.. 
ఏపీలో విద్యుత్‌ ఉత్పత్తికి షిరిడీసాయి ఎలక్ట్రానిక్స్, ఇండోపోల్‌ సోలార్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థలు నెలూలరు జిల్లా రామాయంపేట వద్ద సౌరవిద్యుత్‌ ప్యానెళ్ల తయారీ ప్లాంట్‌ నెలకొల్పేందుకు ఇండోపోల్‌ సంస్థ ముందుకు వచ్చింది. దీనికి సుమారు 5 వేల ఎకరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.43,143 వేల కోట్లు పెట్టుబడి పెడతామని సంస్థ ప్రకటించింది. వైఎస్సార్‌ జిల్లాలో రూ.33,330 కోట్ల పెట్టుబడితో పంప్‌డు సోలార్‌ హైడ్రో విద్యుత ఉత్పత్తికి ముందకు వచ్చింది. షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్‌ కూడా రెండు పంప్‌డు స్టోరేజ్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే వీటికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, ఇతర సదుపాయాలు కల్పిస్తోంది.
సదుపాయాల కల్పన తప్పంట.. 
అయితే ఇప్పుడు ఈనాడుకు వచ్చిన నొప్పి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు కల్పించడం. దీనిని తప్పు పడుతూ రామోజీరావు పతాక శీర్షికన కథనాలు రాస్తున్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే అది రాష్ట్రానికి లాభదాయకమే. పెట్టుబడి ఎవరు పెట్టినా దాని ద్వారా వందల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. అయినా పెట్టుబడులు రావడమే తప్పు అన్నట్లుగా రామోజీ జర్నలిజం కథనాలు రాయడం నిజంగా వెగటు పుట్టిస్తోంది. టీడీపీలో అనేకమంది వ్యాపారులు ఉన్నారు. వారు కూడా వేల కోట్ల వ్యాపారాలు నేస్తున్నారు. నామా నాగేశ్వర్‌రావు అయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు. పోలవారానికి సబంధించిన టెండర్‌ దక్కించుకున్న సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ రాయపాటిది. రామోజీ రావు బంధువుకు చెందిన నవయుగకు తర్వాత అప్పగించింది నిజమే కదా. సుజనా చౌదరి చేసేది కూడా వ్యాపారమే. ఎరపతి నేని కూడా మైనింగ్‌ వ్యాపారంలో ఉన్నారు. వీళ్లు చంద్రబాబు హయాంలో అనేక పెట్టుబడుల పెట్టారు. కానీ జగన్‌కు సంబంధించిన వారు పెట్టుబడి పెడితే మాత్ర దుర్మార్గం అయిపోయింది.
పారిశ్రామిక వేత్తలనే ఎన్నుకుంటున్నారు.. 
ప్రజలు ఎన్నికల్లోల పేదవాడా, డబ్బు లేనివాడా, నిజాయతీ పరుడా అని చూడడం లేదు. డబ్బున్నవాడినే ఎన్నుకుంటున్నారు. అనేకమంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలే ఇప్పుడు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇది రామోజీరావుకు తెలియంది కాదు. కానీ జగన్‌ను విమర్శించాలి. వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి కాబట్టి జర్నలిజం విలువలు మర్చిపోయి.. కథనాలు రాస్తున్నారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version