International Organization for AP : ఏపీకి( Andhra Pradesh) మరో గుడ్ న్యూస్ వచ్చింది. ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమరావతి రాజధానిలో బిట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు కానుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని రానుంది. 35 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులతో ఏడు వేల మంది విద్యార్థులు ఇక్కడ కోర్సులు పూర్తిచేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు ఐబీఎం, టిసిఎస్, ఎల్ అండ్ టి సంస్థలు కలిసి క్వాంటం వ్యాలీని, హెచ్ సి ఎల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నాయి.
Also Read: విశాఖను కమ్ముకున్న మేఘాలు.. రెండూ ఒకేసారి.. ఏం జరుగనుంది?
స్వయంగా వెల్లడించిన చైర్మన్..
అమరావతి రాజధానిలో( Amravati capital ) బిట్స్ పిలాని క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు యూనివర్సిటీ ఛాన్స్లర్, బిర్లా గ్రూపు చైర్పర్సన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతిలో బిట్స్ పిలాని ఏర్పాటు చేయబోయే క్యాంపస్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ కేంద్రంగా ఉండనుంది. 2027 నాటికి ఈ క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండు విడతల్లో 7,000 మంది విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్లస్ క్యాంపస్లో చేర్చుకునేలా ప్రణాళికల రూపొందిస్తున్నట్లు కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతి లోని 35 ఎకరాల్లో బిట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!
సరికొత్త ఆలోచనలతో..
అయితే ఈ క్యాంపస్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్( undergraduate), మాస్టర్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీలలో ఆయా కోర్సులు అందించే ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు క్యాంపస్ ఏర్పాటు చేస్తూనే.. మౌలిక వసతులతో పాటు రీసెర్చ్ డెవలప్మెంట్ సామర్థ్యం పెంచుకునేందుకు మరో రూ.1219 కోట్లు ఖర్చు చేయాలని కూడా యాజమాన్యం భావిస్తోంది. ఇంకోవైపు బిట్స్ పిలాని డిజిటల్ ద్వారా 32 ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో 11 డిగ్రీ కోర్సులు కాగా.. మరో 21 సర్టిఫికెట్ కోర్సులు ఉండనున్నాయి. ఇప్పటికే 2026 నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా బిట్స్ పిలాని రావడం కూడా గమనార్హం.