MLA Arava Sridhar: మహిళల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) మంచి ప్రకటనలు చేస్తారు. వారికి సరైన గౌరవంతో పాటు మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలని పిలుపునిస్తుంటారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే పై వస్తున్న లైంగిక ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం ఇప్పుడు హార్ట్ టాపిక్ అవుతోంది. వివాహేతర సంబంధాలను పార్టీకి పులమాలని చూస్తున్నారు అంటూ ఒక సమర్థింపు ప్రెస్ నోట్ కూడా కూడా జారీ చేశారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే గతంలో టిడిపి ఎమ్మెల్యే పై ఈ తరహా ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల విషయంలో సరిగ్గా స్పందించలేదన్న టాక్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్..
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాను రైల్వే కోడూరు( Railway Koduru) ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలు షేక్ చేస్తున్నాయి. ఓ మహిళా ఉద్యోగిని విషయంలో ఆయన వ్యవహరించిన తీరును బాధితురాలు సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. సదరు ఎమ్మెల్యే తనను ఘోరంగా వంచించాడని.. లైంగిక ఆకృత్యాలకు పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. అయితే అవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు అయి ఉండొచ్చు. లేకుంటే కల్పిత కథలు అయి ఉండొచ్చు. కానీ ముందుగా ఆయన పై సస్పెన్షన్ వేటు వేసి.. తరువాత విచారణకు ఆదేశించి ఉంటే సాహేతుకం అని అనిపించేది.
టిడిపి ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు..
గతంలో టిడిపి ఎమ్మెల్యే ఒకరిపై ఇటువంటి లైంగిక ఆరోపణలు వచ్చాయి. కానీ వెంటనే చంద్రబాబు( CM Chandrababu) ఆయనను సస్పెండ్ చేశారు. చాలా వేగంగా స్పందించారు. ఇప్పటివరకు ఆ సస్పెన్షన్ ఎత్తివేత కూడా జరగలేదు. అయితే ప్రస్తుత రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. బాధితురాలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇటువంటి విషయంలో శరవేగంగా స్పందించాలి. కానీ ఇప్పుడు విచారణకు మాత్రమే ఆదేశించి చర్యలు తీసుకోకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. వెంటనే సస్పెన్షన్ వేటు వేసి.. విచారణకు ఆదేశించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అయితే ఏ విషయం లోనైనా పవన్ కళ్యాణ్ చాలా వేగంగా స్పందిస్తారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే విషయంలో ఏదో తెరవెనుక జరిగి ఉంటుంది. లేకుంటే నేరుగా చర్యలు తీసుకునే వారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి వాస్తవం ఏమిటో చూడాలి.