Ramana Dixit: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరిన తిరుమల తిరుపతి ఆలయంలో ప్రధాన అర్చకులు తమ కుటుంబాలే ఉండాలని రమణ దీక్షితులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఆయన ఏ హోదాలో ఉన్నారో తెలియదుగానీ తానే శ్రీవారి ప్రధాన అర్చకులు అన్నట్లుగా మాట్లాడుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

వంశపారంపర్యంగా శ్రీవారి అర్చకులుగా తమ కుటుంబం వారే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారని రమణ దీక్షితులు చెబుతున్నారు. గత వారం జగన్ సర్కారు వంశపారంపర్య అర్చకులను సైతం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించింది. దీనిని ఆయన వ్యతిరేకిస్తూ మిరాశీ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే దీనిపై న్యాయం పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: చంద్రబాబు రహస్య టూర్.. ఆ దేశానికి ఫ్యామిలీతో.. ఏంటీ కథ..?
ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో పేరొందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామితో రమణ దీక్షితులు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ విషయంలో తగిన న్యాయ సలహా ఇవ్వాలంటూ ఆయనకు ఇటీవల ఓ ట్వీట్ సైతం చేశారు. అయితే తాజాగా తిరుపతికి వచ్చిన సుబ్రహ్మణ్యం అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యాఖ్యలు చేశారు.
అసలు బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలా? అంటూ ప్రశ్నించారు. బ్రాహ్మణులు మాత్రం అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని కామెంట్ చేశారు. వంశపారంపర్య, అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని చెప్పారు. విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రహ్మణులు కాకపోయిన ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేశారని ఆయన గుర్తు చేశారు.
సుబ్రహ్మణ్య స్వామి తనకు న్యాయ సలహా ఇచ్చి గట్టెకిస్తారని అనుకుంటే షాకింగ్ కామెంట్స్ చేయడంతో రమణ దీక్షితులకు ఏమీ పాలువడంలేదు. మరోవైపు గతంలో జగన్ కోరిక మేరకు ఆంధ్రజ్యోతిపై 100కోట్ల పరువు నష్టం దావావేసిన సుబ్రమ్మణ్యం ఆ విషయంలోనూ ఏటూ తేల్చలేకపోయాయి.
దీనికితోడు టీటీడీ ఈవో కోరిక మేరకే పరువు నష్టం దావా వేసినట్లు కవర్ చేసుకుంటున్నారు. ఓవరాల్ గా సుబ్రహ్మణ్య స్వామి అటూ వైసీపికి, ఇటూ రమణ దీక్షితులకు నిరాశనే మిగిల్చినట్లు కన్పిస్తోంది. వంశపారంపర్యంపై గట్టిగా మాట్లాడుతున్న రమణ దీక్షీతులు మరీ ప్రభుత్వాన్ని, న్యాయ స్థానాలను మెప్పించి తిరిగి శ్రీవారి అర్చకత్వాన్ని తమ కుటుంబాలకు మాత్రమే తీసుకుస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: న్యూ ఇయర్ వేళ.. ఏపీలో ఆంక్షలు ఇవే..