https://oktelugu.com/

Manyam: ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు.. ఈ హైలెట్ సీన్ వీడియో చూడాల్సిందే!

మద్యం తాగిన వాడికి లోకం మొత్తం వింతగా కనిపిస్తుందట. ఆ మైకంలో సరికొత్తగా దర్శనమిస్తుందట..ఈ వ్యక్తికి కూడా అలానే కనిపించి ఉంటుంది.. అందువల్లే అతడు జనాల్ని ఇబ్బంది పెట్టాడు. కాసేపు నవ్వించాడు.. ఇంకాసేపు ఉత్కంఠకు గురి చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 1, 2025 / 08:48 AM IST

    Manyam

    Follow us on

    Manyam: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి . మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి పోవడం మొదలుపెట్టింది. కాళ్లు తడబడటం ప్రారంభమైంది. ఆ మైకం నుంచి తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే పక్కన ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇదే మైకంలో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. చుట్టుపక్కల వాళ్ళు వారించినప్పటికీ అతడు ఒప్పుకోలేదు. అదే మైకంలో అలానే స్తంభం ఎక్కాడు. దీంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. విద్యుత్ స్తంభం పెట్టిన అతడు తీగలపై పడుకున్నాడు. అక్కడ చాలాసార్లు తనదైన విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత స్థానికులు స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దింపారు.

    సోషల్ మీడియాలో సంచలనం

    ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా హల్ చల్ సృష్టిస్తున్నాయి.. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతడి తీరుపై మండిపడుతున్నారు. ” మద్యం తాగడం అనేది ఇటీవల కాలంలో పెరిగిపోయింది. అకేషన్ తో సంబంధం లేకుండా అడ్డగోలుగా తాగడం.. ఇలా రోడ్లమీదకి రావడం పరిపాటిగా మారింది. జనం వైపరీతంగా తాగడం.. పనీ పాటా లేకుండా తిరగడం పెరిగింది. దీనికి తోడు అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా 40 సంవత్సరాలు కూడా నిండకుండానే కన్నుమూస్తున్నారు. ఇలా మద్యం తాగి అకాల మరణాలకు గురవుతున్న వారిలో ఎక్కువ శాతం యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వాలు మద్యం దుకాణాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నాయి. మద్యం మీదనే వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఆదాయం వస్తుందనే ఆశతో మద్యాన్ని విపరీతంగా పొంగిస్తున్నాయి. దీనివల్ల ఎన్నో సంసారాలు నేలకూలుతున్నాయి. చాలామంది మహిళలు చిన్నతనంలోనే వితంతువులుగా మారుతున్నారు. ఇలాంటి పరిణామం అసలు మంచిది కాదు. దీనిని ప్రభుత్వాలు అరికట్టాలి. మద్యం వ్యాపారానికి చరమగీతం పాడాలి. కేవలం మద్యం మీదనే వ్యాపారం చేయడం కట్టిపెట్టాలి. సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టి.. మద్యానికి అలవాటు చేసి ప్రభుత్వం ఖజానా నింపుకోవడం సరికాదు. ఇలాంటి విధానాలు దీర్ఘకాలంలో సమాజానికి తీవ్రమైన నష్టం చేకూర్చుతాయని”.. సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.