IMD Weather Update AP: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది వర్షాకాలంలో విస్తారంగా వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ జూలై నెలలో కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అని ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షాల కోసం ప్రజలు ఎదురు చూశారు. కొన్ని ప్రాంతాలలో పంటలు ఎండిపోయాయి. ఈ క్రమంలో రైతులకు తీపి కబురు చెప్పినట్టుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: ₹6,880 కోట్లు కోరితే ముష్టి రూ.1036 కోట్లు!.. ఇది ఏపీ వరదలకు కేంద్రం ఇచ్చిన సాయం
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో.. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఐదు రోజులు పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలకురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: రేవంత్ సార్.. ఆ ‘ఖమ్మం’ బాధితులు పిలుస్తున్నారు..!
అల్ప పీడనానికంటే ముందు గడిచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వరద నీరు పోటెత్తడంతో వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరంగల్ రైల్వే స్టేషన్ పట్టాల మీదకి నీళ్లు రావడంతో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగిన నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ తన సేవలను నిలిపివేసింది. భారీగా వర్షాలకు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రం గాని అప్రమత్తం చేసింది. హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.. మరోవైపు హైదరాబాద్ నగరంలో కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించింది.