Jagan admits his mistake: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతోంది అని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు సైతం అలానే ఉన్నాయి. ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం ప్రాజెక్టు, ఇంకోవైపు పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందుతోంది. సంక్షేమ పథకాలను కూడా అమలు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి సంతృప్తి కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కలవరపాటుకు ఇదే కారణం అవుతోంది. అయితే దీనిని ఒప్పుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసిపి హయాంలో చేసిన పనులను చెప్పుకోలేకపోయామని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ఇదే అభిప్రాయంతో ఉండేవారు. దానిని ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటన చేయడం విశేషం.
సంక్షేమాన్ని నమ్ముకున్న వైసిపి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ హయాంలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రజలకు నగదు పంపిణీ ద్వారా వారి జీవితాలు బాగు చేయవచ్చని జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే ఉచిత పథకాల మాటున దుబారా పెరిగింది అన్న విమర్శ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై వచ్చింది. అయితే చాలా రకాల అభివృద్ధి వైసీపీ హయాంలో కూడా జరిగింది. కానీ వైసిపి ప్రభుత్వం పై వచ్చిన విమర్శలతో అవన్నీ కొట్టుకు వెళ్ళిపోయాయి. పైగా ఎంతవరకు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు తప్ప.. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏం చేసింది? ఎలాంటి పనులు చేసింది? ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టారు? అన్న విషయాలను చెప్పలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి అదే నష్టం చేసింది. ఎంతవరకు జనం సంతృప్తిగా ఉన్నారు.. తప్పనిసరిగా ఓటు వేస్తారు అని బలంగా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. వైసిపి చేసిన అభివృద్ధి కంటే ఆ పార్టీపై వచ్చిన విమర్శలు తీవ్ర నష్టం చూపించాయి.
మూడు పార్టీలు ఉమ్మడిగా..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వెళ్తోంది. పాలనలో చేపట్టిన పనులు, అభివృద్ధిని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. పైగా మూడు పార్టీల శ్రేణులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపరంగా సహకారం ఉండడంతో బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అదే సమయంలో కూటమి హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వయం. రాజకీయంగా ప్రభుత్వం పై విమర్శలు చేసేవారు చేస్తుంటారు. కానీ తటస్తులు, విద్యాధికులు మాత్రం ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి కనిపిస్తోంది. అదే సమయంలో పథకాలను సైతం అమలు చేస్తున్నారు. కానీ వైసీపీ హయాంలో కేవలం సంక్షేమం పైనే దృష్టి పెట్టారన్న విమర్శ ఉంది. వాటన్నింటికీ చెబుతూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 15 నెలల పాలన సూపర్ హిట్ అని చూపించేసరికి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వాళ్లు చెప్పుకుంటున్నారు… మేము చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే మాకు మైనస్ చేసింది అంటూ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ శ్రేణుల మాట.. జగన్ నోటి వెంట..
మేము చేసింది కూడా చెప్పుకోలేకపోవడం మా ప్రాబ్లెమ్ – మాజీ సీఎం #YSJagan pic.twitter.com/N7T4Ew9WxK
— greatandhra (@greatandhranews) September 10, 2025