AP Elections 2024 : వందల కోట్ల బెట్టింగ్.. ఏపీలో కాయ్ రాజా కాయ్

వైసిపి మరోసారి అధికారంలోకి వస్తుందా? టిడిపి కూటమి అధికారాన్ని దక్కించుకుంటుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు గెలుస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అన్న అంశాల చుట్టూ బెట్టింగ్ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : May 16, 2024 4:17 pm

Hundreds of crores bet on AP elections

Follow us on

AP Elections 2024 : సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఎంపీ సీట్లకు, ఏపీలో ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. కానీ తెలంగాణ కంటే ఏపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. భారీగా హింస చెలరేగింది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల వరకు కొనసాగింది. దీంతోనే అర్థమవుతుంది ఏ స్థాయిలో ఫైట్ జరిగిందో. అందుకే ఏపీ ఫలితాల పట్ల అంతటా ఉత్కంఠ నెలకొంది. దీంతో బెట్టింగులు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. భారీగా బెట్టింగ్ ముఠాలు ప్రవేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసిపి మరోసారి అధికారంలోకి వస్తుందా? టిడిపి కూటమి అధికారాన్ని దక్కించుకుంటుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు గెలుస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అన్న అంశాల చుట్టూ బెట్టింగ్ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్లలో ఈ బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం. లక్షకు ఐదు లక్షలు చొప్పున బెట్టింగ్ జరుగుతుండడం విశేషం. ప్రధానంగా ఏపీలో పిఠాపురం పైనే అందరి ఫోకస్ ఉంది. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం పిఠాపురం నియోజకవర్గ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ సైతం గట్టిగానే ఫోకస్ పెట్టింది. అందుకే ఇప్పుడు పిఠాపురం చుట్టూ బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం. పవన్ గెలుస్తాడా? లేదా? అన్నదానిపై జోరుగా పందాలు కొనసాగుతున్నాయి. పవన్ తరువాత లోకేష్ పైనే ఎక్కువ బెట్టింగ్ సాగుతుండడం విశేషం. మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ సైతం వైసిపి పట్టు బిగించాలని ప్రయత్నించింది. అందుకే ఇక్కడ సైతం భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

వై నాట్ కుప్పం అని వైసిపి సౌండ్ చేసింది. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడిస్తామని శపధం చేసింది. దీంతో అందరి చూపు కుప్పం వైపు పడింది. వైసిపి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో రాజకీయంగా కుప్పం హాట్ టాపిక్ గా మారింది. అందుకే అక్కడ చంద్రబాబు గెలుస్తాడా? లేదా? అని ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తున్నారు. చంద్రబాబుకు మెజారిటీ తగ్గుతుందా? లేదా? అన్న అంశంపై కూడా పందాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు గెలుపోటములపై కాకుండా.. మెజారిటీపైనే ఎక్కువ శాతం బెట్టింగ్ జరుగుతుండడం విశేషం. అటు కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పై కూడా బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం. షర్మిల ఎంపీగా గెలుపొందుతారని.. పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందని.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ సాగుతోంది. వీరితోపాటు ఏపీలో కీలక నాయకులు, వివాదాస్పద నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై సైతం బెట్టింగ్ సాగుతుండడం విశేషం. అయితే బెట్టింగులు వందల కోట్ల రూపాయలకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.