Legal validity to Amaravati: అమరావతి రాజధాని( Amaravati capital ) కి చట్టబద్ధతపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు కావడం.. టిడిపి తో పాటు కూటమి ఎంపీలకు కీలక సూచనలు చేయడం చూస్తుంటే మాత్రం బిల్లు పార్లమెంట్ లోకి వస్తుందని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఆ 29 గ్రామాలను మాత్రమే కలిపి అమరావతిగా గుర్తిస్తారా? లేకుంటే పక్కన ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ గుర్తిస్తారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే అమరావతి అంటే మున్సిపాలిటీ కాదు అని.. అదో మహానగరం గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం చట్టబద్ధత కల్పిస్తున్న దృష్ట్యా అమరావతిని మరింత విస్తృతపరచి గుర్తించాల్సిన అవసరం ఉంది. విజయవాడ తో పాటు గుంటూరు నగరాలను కలిపితేనే.. అమరావతి అనేది ఒక అద్భుతమైన నగరంగా ఆవిష్కృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అదనపు భూసేకరణ..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు చంద్రబాబు( CM Chandrababu). దాదాపు 50 వేల ఎకరాల వరకు సమీకరించి అమరావతి రాజధాని పనులను మొదలుపెట్టారు. ఇంతలోనే అధికార మార్పిడి జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి నిర్వీర్యం అయింది. గత ఐదేళ్లపాటు అమరావతి రైతులు పడరాని పాట్లు పడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చుక్కలు చూపించింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా. అయితే ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానిపై విషం కక్కుతూనే ఉంది. దీంతో అమరావతికి చట్టబద్ధత తెస్తే కానీ తమకు శాంతి ఉండదని అమరావతి రైతులు కోరుతూ వచ్చారు. అందుకే ఏపీ విషయంలో ప్రత్యేక పరిగణలోకి తీసుకొని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
మిగతా ప్రాంతాలను కలుపుతూ..
అయితే కేవలం 29 పంచాయితీలను మాత్రమే అమరావతిగా గుర్తిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే అదనపు భూసేకరణ చేపడుతున్నారు. చెంతనే విజయవాడ( Vijayawada) ఉంది. ఆపై గుంటూరు నగరం కూడా ఉంది. కృష్ణా,గుంటూరు, ఎన్టీఆర్ తో పాటు పరిసర జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను అమరావతిలో చేర్చితే ఇదో మహానగరంగా, ప్రపంచ స్థాయి నగరంగా గుర్తించబడుతుంది. ఇప్పటికే అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది ప్రణాళిక. అందుకు తగ్గట్టు చంద్రబాబు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆ 29 పంచాయితీలకే అమరావతిని పరిమితం చేయడం ఎంత మాత్రం సుముఖత కాదు. అయితే అందుకే సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలతో సమన్వయం చేసుకుంటున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత విషయంలో సానుకూలతలకు ప్రయత్నిస్తున్నారు. విస్తృత సంప్రదింపులు జరపాలని పార్టీ ఎంపీలకు సూచిస్తున్నారు. మొత్తానికైతే అమరావతి చట్టబద్ధత విషయంలో ఏం జరుగుతుంది అనే దానిపై అంతటా చర్చ నడుస్తోంది.