TTD Online Booking Process: శ్రీవారి దర్శనానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ నెలలో దర్శనం చేసుకునే భక్తుల కోసం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో భక్తులు బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఆశీస్సులు అందుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది. దీన్ని గమనించి భక్తులు బుకింగ్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

శ్రీవారి దర్శన టికెట్లను తిరుమల అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన అన్ని రోజుల టికెట్లను నవంబర్ 11 నుంచి అందుబాటులోకి తేనుంది. డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇవ్వనున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in లో బుక్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవాలని సూచిస్తోంది తిరుమలలో నిబంధనలు సడలించిన నేపథ్యంలో భక్తుల రాక పెరిగింది.
మొబైల్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్ సైట్ లో శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి. దీంతో బుక్ చేసుకునే ముందు కచ్చితంగా ఆధార్ నెంబర్ లాగిన్ అయ్యాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వచ్చిన తరువాత ఖాళీల వివరాలు కనిపిస్తాయి. డిసెంబర్ నెలలో మీకు అనుకూలమైన డేట్ పై క్లిక్ చేసి ఏ సమయంలో కావాలో ఎంపిక చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే టికెట్లు బుక్ అవుతాయి. ఒక మొబైల్ నెంబర్ నుంచి 6 మందికి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇతర కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు కావాలంటే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ల ద్వారా బుక్ చేస్తే మీ సొమ్ము వేరొకరికి బదిలీ కావచ్చు. దీంతో జాగ్రత్తగా వ్యవహరించి టీటీడీ వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోండి. తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు, దర్శనం క్యూలైన్, గదుల కేటాయింపు కౌంటర్, ఈవో కార్యాలయం, చైర్మన్ కార్యాలయం, వసతి గదులకు వెళ్లాలంటే ఇబ్బందులు పడకుండా స్మార్ట్ ఫన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ల ద్వారా గమ్య స్థానాలను సులభంగా చేరుకోవచ్చు