Chandrababu And Jagan Diwali Celebrate: దీపావళి( Diwali) పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారికి క్షణం తీరిక ఉండదు. కానీ ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా ఉన్న సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం కుటుంబ సభ్యులతో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసంలో భార్య నారా భువనేశ్వరి తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ మాత్రమే ప్రత్యేకంగా దీపావళి సందర్భంగా బాణసంచా కాలుస్తున్న ఫోటోలను టిడిపి అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చంద్రబాబు భువనేశ్వరి పక్క పక్కనే బాణసంచా వెలిగిస్తూ కనిపిస్తున్నారు.
* బెంగళూరులో జగన్..
మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సైతం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బెంగళూరులోని ఎలాహంక ప్యాలెస్ లో దీపావళి జరుపుకోవడం విశేషం. నిన్ననే ఆయన లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చారు. సాయంత్రం దీపావళి వేడుకల్లో భార్య వైయస్ భారతి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలహంక ప్యాలెస్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాణసంచా కాలుస్తూ దట్టంగా అలుముకున్న ఒక మధ్యలో జగన్ దంపతులు కనిపిస్తుండడం అభిమానుల్లో సంతోషం నింపుతోంది. వైసిపి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ దృశ్యాలు.
* విదేశాల్లో లోకేష్..
మరోవైపు విదేశాల్లో ఉన్న మంత్రి నారా లోకేష్( Nara Lokesh) దీపావళి వేడుకల్లో పాల్గొనలేకపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఆయన దీపావళి వేడుకలకు సంబంధించి ఎటువంటి ఫోటోలు పార్టీ విడుదల చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్వతిపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పేలుడు ఘటనకు మినహాయించి.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక అనుమతులతో బాణసంచా దుకాణాలు వెలిసాయి. సోమవారం సాయంత్రం వరకు కొనసాగాయి.
వై ఎస్ జగన్ నివాసంలో దీపావళి వేడుకలు
దీపావళి వేడుకల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్, సతీమణి వై ఎస్ భారతి
బాణసంచా కాల్చిన వై ఎస్ జగన్ దంపతులు
దీపావళి వేడుకలు సందర్భంగా వై ఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ pic.twitter.com/4scNClzWdN
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) October 20, 2025