AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కుండపోత వర్షం పడే సూచన కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరంలో ఈ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. అది వాయుగుండం గా మారితే మాత్రం ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే సూచన కనిపిస్తోంది. దీని ప్రభావం తెలంగాణ పై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమయింది. అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది.
Also Read: ‘మిరాయి’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా?
* ఈరోజు ఈ జిల్లాల్లో వర్షం..
ప్రధానంగా పశ్చిమగోదావరి( West Godavari ), ఏలూరు,ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు నవోదయ చాన్స్ ఉంది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మాస్టరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ఆ రెండు జిల్లాల్లో కుండ పోత..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రధానంగా నంద్యాల జిల్లా( Nandyala district) కొత్తపల్లిలో అత్యధికంగా 60.2 మిల్లిమీటర్లు, ఎనకండ్లలో 52.2 వర్షపాతం నమోదయింది. అనంతపురం కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఆ రెండు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అనంతపురం జిల్లా యల్లనూరులో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వేగవతి నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. కర్ణాటక జిల్లాలో భారీ వర్షాలు నమోదు అవుతున్న క్రమంలో కుషావతి, చిత్రావతి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
* తీరం వెంబడి ఈదురు గాలులు..
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్ష సూచన ఉన్న జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు నైరుతీ రుతుపవనాలు వాయువ్య భారతదేశం నుంచి ఈనెల 16, 17 తేదీల్లో నిష్క్రమించే అవకాశం ఉంది. అందుకు తగ్గ అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.