Gautam Adani: గౌతం అదానీ.. దేశంలో ధనవంతుల్లో రెండో స్థానంలో, ప్రపంచంలో టాప్ 10లో ఉన్న వ్యక్తి. బడా పారిశ్రామిక వేత్త. నరేంద్రమోదీ ప్రధాని కాకముందు అదానీ ఎవరికీ తెలియదు. కానీ, మోదీ ప్రధాని అయ్యాక ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. గడిచిన పదేళ్లలో ప్రపంచంలోనే సంపన్నుడిగా మారిపోయాడు. గౌతం అదానీకి, ప్రధానికి మధ్య సంబంధాలు ఉన్నాయని, ఆయన అభివృద్ధి వెనుక ప్రధాని ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐదేళ్లుగా ప్రతిపక్షాలు అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ అదానీ అవినీతిని బయట పెట్టింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలాయి. అదానీపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవలే కమిటీ సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది. అదానీకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే అదానీ సంస్థలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో అదానీ కంపెనీపై కేసు నమోదైంది. లంచాలు ఇవ్వజూపినట్లు అభియోగాలు నమోయ్యాయి.
ఏపీలో ప్రకంపనలు..
అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడంతో ఆయన కంపెనీకి చెందిన షేర్లు పడిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మరోవైపు అదానీపై కేసు నమోదు.. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీక కంపెనీకి చెందిన సోలార్ పవర్ కొనుగోలు కోసం ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అదానీ నుంచి రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అదానీ నుంచి జగన్ లంచం తీసుకోవడం అంత ఈజీనా అన్న చర్చ జరుగుతోంది. ప్రధానికి అత్యంత సన్నిహితుడైన అదానీని జగన్ నేరుగా లంచం అడిగే సాహసం చేయగలడా అన్ని అనుమానిస్తున్నారు. మరి ఇది ఎలా జరిగి ఉంటుంది.. అన్నది చర్చనీయాంశమైంది. మొత్తం ప్రధాని మోదీకి తెలిసే జరిగిందన్న చర్చ కూడా జరుగుతోంది.
అప్పట్లో కేంద్రంతో సఖ్యత..
2019 నుంచి 2014 వరకు వైసీపీ కేంద్రంతో సఖ్యతగా ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా.. రాజ్యసభలో మెజారిటీ లేదు. అదే సమయంలో వైసీపీకి రాజ్య సభలో ఎంపీలు ఉన్నారు. దీంతో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి కేంద్రం వైసీపీ సాయం తీసుకుంది. ఇక ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వంతో కేంద్రం సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే అదానీకి చెందిన సోలార్ పవర్ కొనేందుకు అదానీ సీఎం జగన్‌కు రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని తెలుస్తోంది.
మోదీకి తెలిసే?
అయితే ప్రతీ విషయాన్ని అదానీ మోదీతో షేర్ చేసుకుంటారు. అంత సాన్నిహిత్యం ఉంది. జగన్‌కు లంచం ఇచ్చిన విషయం కూడా మోదీకి తెలిసే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ లంచంలో కొంత ఏపీ సీఎం జగన్ తీసుకుని, మరికొంత బీజేపీకి పార్టీ ఫండ్ కింద ఇచ్చి ఉంటారనని తెలుస్తోంది. ఎలక్షన్ బాండ్ల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు వివరాలు బయట పెట్టింది. ఇందులో అదానీ బీజేపీకి ఎలాంటి బాండ్లు ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్‌తోపాటు విపక్ష పార్టీలు అదానీ, మోదీ బంధంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల బాండ్ల కొనుగోలు చేస్తే మరిన్ని విమర్శలు వస్తాయని అదానీ బాండ్లు కొనుగోలు చేయలేదని సమాచారం.
బాండ్లకు బందులు లంచం..
బీజేపీలో ఎవరూ వక్తిగతంగా లంచాలు తీసుకోరు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అయితే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయని అదానీ, బీజేపీకి పరోక్షంగా సాయం చేశారని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్‌కు ఇచ్చిన రూ.1,750 కోట్లలో కొంత మొత్తం బీజేపీకి పార్టీ ఫండ్ కింద ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది. అందుకే కేంద్రం కూడా అమెరికాలో నమోదైన కేసుపై స్పందించడం లేదని తెలుస్తోంది.
జగన్ కూడా ధైర్యంగా..
ఇక అదాని కేసు విషయంలో జగన్ కూడా ఎక్కడా బెదరడం లేదు. బెరుకు కనిపించడం లేదు. మరోవైపు జగన్‌పై ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే టీడీపీ, జనసేన నేతలు కూడా సైలెంట్‌గా ఉన్నారు. అదానీ అవినీతి వ్యవహారంపై మాట్లాడడం లేదు. దీంతో ప్రధానికి తెలిసే అంతా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. జగన్ వరకు కేసు వస్తే ముందుగా కేంద్రం, ప్రధానికి చుట్టుకుంటుంది. అందుకే రాష్ట్రంలో టీడీపీ, జనసేన నేతలు సైలెంట్‌గా ఉంటున్నారని తెలుస్తోంది.