Greater Visakhapatnam: విశాఖ పై( Visakhapatnam) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. జగన్ సర్కార్ విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. రుషికొండపై భవనాలు నిర్మించింది. కానీ అవి ఎందుకు నిర్మించిందో మాత్రం చెప్పలేదు. కూటమి ప్రభుత్వం అలా కాదు. విశాఖ నగరానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను తెస్తోంది. మిగతా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. అనుబంధ పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ నగరాన్ని మరింత విస్తరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో బల్దియా చేయాలనుకుంటోంది. తాజాగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్న 70 పంచాయితీలను మహా విశాఖ నగరపాలక సంస్థలు విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఎదుగుతూ వస్తున్న నగరం..
విశాఖ నగర ప్రస్థానం చూస్తే మాత్రం క్రమేపి ఎదుగుతూ వస్తోంది. అయితే వైసిపి హయాంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ప్రత్యేకంగా దృష్టిపెట్టారు విశాఖపట్నం పై.. అయితే అది అభివృద్ధి పరంగా రాజకీయంగా తన ముద్ర చాటుకునేందుకు విశాఖను వేదికగా చేసుకున్నారు. ఎప్పుడు హడావిడితో నడిచేది వైసిపి హయాంలో విశాఖ నగరంలో. ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు వైసీపీ నేతల తాకిడి అధికంగా ఉండేది. దీంతో నగరవాసులు ఒక రకమైన ఆందోళన కనిపించేది. ఆ హడావిడి కి తగ్గట్టు ఎటువంటి అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు.. పైగా కొంతమంది వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆంధ్ర యూనివర్సిటీ భూముల్లో ప్రైవేట్ సంస్థల ఎంట్రీ అప్పట్లో జరిగింది. ఈ పరిణామాల క్రమంలో విశాఖ ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారు. అభివృద్ధి జరగకపోగా నగరంలో ఈ గందరగోళ పరిస్థితులు ఏమిటి అని ఎక్కువమంది ప్రశ్నించారు.
గ్రేటర్ పరిధిలోకి అన్ని పంచాయతీలు..
మొన్నటి ఎన్నికల్లో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రజల్లో ఉన్న ఆందోళన కారణం. దానిని గుర్తించింది కూటమి ప్రభుత్వం. ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా విశాఖను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ పరిధిలోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇటు భీమిలి, అటు గాజువాక, పెందుర్తి పరిధిలో ఉన్న అన్ని పంచాయితీలు గ్రేటర్లో విలీనం కానున్నాయి. ఇటీవల పంచాయతీలు చేర్పుల మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఉన్న నిషేధాన్ని తొలగించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇచ్చారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ముందే ఈ 70 పంచాయితీలు గ్రేటర్ పరిధిలోకి రానున్నాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మున్ముందు అటు విజయనగరం, ఇటు అనకాపల్లి పరిధిలో సైతం చాలా ప్రాంతాలు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చి పరిస్థితి అయితే ఉంది. అదే జరిగితే గ్రేటర్ విశాఖ మరో బల్దియా కావడం ఖాయం.