Google Data Center in Vizag: విశాఖ గూగుల్ డేటా సెంటర్కు( Google data centre) సంబంధించి శరవేగంగా భూ సేకరణ సాగుతోంది. కొద్ది రోజుల కిందట విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం దాదాపు 300 ఎకరాలకు పైగా భూమి కేటాయిస్తామని చెప్పడంతో పాటు డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి చట్టం మార్చి కొన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చారు. దీంతో ఏపీ వైపు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దేశంలోనే ఇది చర్చకు దారి తీసింది. టిడిపి కూటమి పాలన పట్ల ప్రజల సంతృప్తి చెందేలా ఉండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఈ తరుణంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన భూ సేకరణకు అనేక రూపాల్లో అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకోవడంతో.. రైతుల డిమాండ్లను సైతం పరిగణలోకి తీసుకున్నారు. పరిహారం విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.
Also Read: ఐకానిక్ టవర్.. ధీమ్ టౌన్ షిప్.. ఇంటర్నేషనల్ బే సిటీగా విశాఖ
300 ఎకరాలకు పైగా భూ సేకరణ..
భీమిలి( bheemili) నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం తర్లువాడలో దాదాపు 300 ఎకరాలకు పైగా భూమిని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆశించిన స్థాయిలో పరిహారం ఇవ్వడం లేదని.. పునరావాస చర్యలు చేపట్టడం లేదని రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కలుగజేసుకుంది. రైతుల్లో ఒక రకమైన అపోహలు సృష్టించేలా చేసింది. అయితే స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సైతం భూమి కోల్పోయిన రైతుల విషయంలో కొన్ని రకాల పరిహారాలను పెంచింది. వారికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పడంతో దాదాపు 60 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం విశేషం. మిగతావారు సైతం భూములు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.
పరిహారంలో మార్పులు..
ఎకరా భూమి ఇచ్చిన వారికి.. 80 సెంట్లు సంబంధించిన పరిహారం… మిగతా 20 సెంట్లు కు సంబంధించి వేరేచోట భూమి కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు మూడు సెంట్లు ఇంటి స్థలం చొప్పున వేరే చోట భూమి కేటాయించింది ప్రభుత్వం. పైగా భూముల విలువను పెంచుతూ.. ప్రతి ఎకరాకు 20 లక్షల వరకు పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు అడ్డంకులు సృష్టించిన వైసీపీ చోటా నాయకులు సైతం ఈ పరిహారం పెంచడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా భూములు వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి గూగుల్ డేటా సెంటర్కు ఆ భూమిని అప్పగిస్తే.. కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది సదరు సంస్థ.
Also Read: కుప్పంలో సౌత్ కొరియా పరిశ్రమ కోసం చంద్రబాబు బిగ్ స్టెప్
అతిగా వ్యవహరించిన వైసిపి..
అయితే గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ కొంచెం అతిగా వ్యవహరించింది. దాని ద్వారా ఎటువంటి ఉద్యోగాలు రావని.. రాష్ట్రానికి కూడా ఆదాయం రాదని ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే ఆలస్యంగా స్పందించారు అధినేత జగన్మోహన్ రెడ్డి. పార్టీ శ్రేణులకు భిన్నంగా మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి ఉంటుందని.. అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున తరలివస్తాయని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి వైసిపి నేతలు సైలెంట్ గా ఉండగా.. ఏకంగా వైసీపీకి చెందిన ఎంపీపీ కుటుంబం సైతం పెద్ద ఎత్తున ఆస్తులు వదులుకోవడం విశేషం.