https://oktelugu.com/

APSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీలో 606 కొలువులు

పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వచ్చింది.భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీచేసింది. 606 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 8, 2024 11:02 am
    APSRTC

    APSRTC

    Follow us on

    APSRTC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీఎస్ఆర్టీసీ భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది.విజయవాడ, కర్నూలు జోన్లలో వివిధ ట్రేడ్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 66 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఆయా ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఆయా ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధృవపాత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఐటిఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం అప్రెంటిస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు జోన్లో 295 అప్రెంటిస్ ఖాళీలు, విజయవాడ జోన్లో 311 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, రాస్తున్నాను సివిల్ ట్రేడ్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

    * విజయవాడ జోన్ పరిధిలో కృష్ణ,గుంటూరు,బాపట్ల,పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు రానున్నాయి. ఇందులో కృష్ణాజిల్లాలో ఖాళీలు 41, ఎన్టీఆర్ జిల్లాలో 99, గుంటూరు జిల్లాలో 45, బాపట్ల జిల్లాలో 26, పల్నాడు జిల్లాలో 45, ఏలూరు జిల్లాలో 24, పశ్చిమగోదావరి జిల్లాలో 31 ఖాళీలు ఉన్నాయి.
    * కర్నూలు జోన్ పరిధిలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాలు రానున్నాయి.కర్నూలు జిల్లాలో 47 ఖాళీలు ఉన్నాయి.నంద్యాలలో 45, అనంతపురంలో 53, శ్రీ సత్య సాయి జిల్లాలో 37, కడప జిల్లాలో 65, అన్నమయ్య జిల్లాలో 48 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 6 నుంచి ప్రారంభం అయింది. ఈనెల 20 వరకు అవకాశం ఉంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సీనియార్టీ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు కింద మాత్రం 118 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.