Ration Cards: ఏపీలో( Andhra Pradesh) రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్. ఈసారి బియ్యం, పంచదార మాత్రమే కాదు. రాగులతో పాటు జొన్నలు కూడా అందిస్తారు. ఇప్పటికే రాయలసీమలో జొన్నలు అందిస్తూ వస్తున్నారు. ఇకనుంచి ఉత్తరాంధ్రలో సైతం జొన్నలతో పాటు రాగులు అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పౌరుసరఫరాల గోదాములకు రాగులతో పాటు సజ్జలు చేరుకున్నాయి. సాధారణంగా 20 కేజీల బియ్యం అందుకునే వారికి.. మూడు కేజీల రాగులు అందిస్తారు. 17 కేజీల బియ్యం అందించనున్నారు. నిజంగా ఇది ప్రజలకు శుభవార్త. రేషన్ పంపిణీని మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* సమూల ప్రక్షాళన..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ వాహనాలను ఏర్పాటు చేసింది. వాటికి నెలకు 21 వేల రూపాయలను అందించింది. తద్వారా నెలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసేది. గత ఐదేళ్లలో వాహనాలకే దాదాపు వందల కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగాయి అంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ వాహనాలను రద్దుచేసి పాత ప్రక్రియను పునరుద్ధరించారు. డీలర్ల వద్ద సరుకులు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వం రంజాన్ తోఫా, సంక్రాంతితో పాటు క్రిస్మస్ కు సరుకుల కిట్ అందించేది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తుందన్న వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదు.
* విపరీతమైన డిమాండ్..
రాగులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు జొన్నల పరిస్థితి కూడా అంతే. వాటి పంట తగ్గడంతో ధరతో పాటు డిమాండ్ పెరిగింది. కొన్ని రకాల రుగ్మతలకు రాగులు, రాగి పిండి కూడా కీలకంగా మారింది. వైద్యులు ఆహారంగా ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వాటిలో ఔషధ గుణాలు పుష్కలం. అయితే బహిరంగ మార్కెట్లో వాటి ధర ఎక్కువగా ఉంది. అందుకే మార్క్ఫెడ్( markfed ) ద్వారా వాటిని సేకరించి పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని రకాల సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించాలని ప్రజలు కూడా కోరుతున్నారు.