Good news for ration card holders : ఏపీలో రేషన్ కార్డులు( ration cards ) ఉన్నవారికి గుడ్ న్యూస్. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీపిక అభివృద్ధి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వద్దని డీలర్లకు సూచించారు. ఒకవేళ సర్వర్ సమస్య ఎదురైతే.. రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకుల పంపిణీ ని కూడా ఎక్కడా ఆపొద్దని సూచించారు. అవసరం అనుకుంటే లబ్ధిదారుడి ఫోటో తీసుకుని, సంతకం చేయించుకుని నిచ్చవసరాలు ఇవ్వాలని తెలిపారు. జూన్ నెల నుంచి రేషన్ డిపోల ద్వారా నిత్యవసరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏలూరులోని ఓ రేషన్ డిపోను స్వయంగా మంత్రి తనిఖీ చేశారు. డిపోలో బియ్యంతో పాటు ఇతర నిత్యవసర సరుకులను పరిశీలించారు.
* సగానికి పైగా రేషన్ పంపిణీ..
గత పది రోజులుగా రేషన్ డిపోల ద్వారా పంపిణీ జరుగుతోంది. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా ఇంటింటా రేషన్ పంపిణీ చేసేది. అయితే ఆ వాహనాల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ పక్కదారి పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఆ వాహనాలను రద్దు చేసింది. పాత పద్ధతిలో రేషన్ డిపోల ద్వారా అందించే ఏర్పాట్లు చేసింది. తాజాగా ఆ రేషన్ డిపోను పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. బియ్యం నాణ్యతను పరిశీలించి అక్కడ ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొత్త రాష్ట్రం విధానం అమలు గురించి, బియ్యం నాణ్యత గురించి స్థానిక మహిళని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ అందిస్తున్నామన్నారు. మొత్తం 15 లక్షల 75 వేల కుటుంబాలకు రేషన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 12 లక్షల 46 వేల కుటుంబాలకు అందించగలిగామని చెప్పారు. మరో ఐదు రోజుల్లో లక్ష్యానికి చేరువు అవుతామని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్.
Also Read : రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సన్న బియ్యం సిద్ధం చేస్తున్న అధికారులు!
* సన్న బియ్యంతో భోజనం..
మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) ఏలూరులోని ఈదర సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యాన్ని తనిఖీ చేశారు. పాఠశాలకు సరఫరా చేసిన 25 కిలోల బియ్యం బస్తాను, రాగి పిండి, బెల్లం పొడి ప్యాకెట్లను పరిశీలించారు. ఈనెల 12 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలు, నాలుగువేల సంక్షేమ హాస్టల్లో సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు మంత్రి. పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ విద్యార్థులకు ఇకపై రుచికరమైన భోజనం అందుతుంది. విద్యా వ్యవస్థలో మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.