Homeఆంధ్రప్రదేశ్‌Good news for Arunachalam : అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

Good news for Arunachalam : అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

Good news for Arunachalam : ఏపీ నుంచి అరుణాచలం( Arunachalam) వెళ్లే యాత్రికులకు శుభవార్త. నిత్యం ఏపీ నుంచి భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. అయితే ఇకనుంచి ఆర్యవైశ్య వాసవీ నిత్య అన్నదాన సత్రం అక్కడ అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు వసతికి సంబంధించిన భవనాలు కూడా ఏర్పాటయ్యాయి. ఏపీ మంత్రి టీజీ భరత్ వాటిని ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో అక్కడి భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన సత్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆర్యవైశ్య సంఘం. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులను మంత్రి టీజీ భరత్ అభినందించారు. అరుణాచల క్షేత్రానికి విశిష్ట చరిత్ర ఉంది. అక్కడ గిరి ప్రదక్షిణ నాడు ఏపీ నుంచి వేలాది మంది భక్తులు వెళుతుంటారు. అటువంటి సమయంలో సరైన వసతి లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్యవైశ్య సంఘం ముందుకు వచ్చింది. నిత్య అన్నదాన సత్రం తో పాటు వసతి కోసం భవనాలను సైతం అందుబాటులోకి తెచ్చింది.

* తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి.. తమిళనాడులో( Tamil Nadu ) అరుణాచల క్షేత్రం ఉంది. దీనికి విశిష్ట చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వెళుతుంటారు. వారికోసం ఇక్కడ కొన్ని సత్రాలు ఏర్పాటు చేశారు. తాజాగా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ కొత్త భవనాలను ప్రారంభించింది. ఈ సత్రం ద్వారా తెలుగు భక్తులు కూడా సేవలు పొందవచ్చు. తిరువణమలై బస్టాండ్ నుంచి కేవలం రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలేశ్వర స్వామి ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదానం ట్రస్ట్ రెండు పడకల ఏసి, నాన్ ఏసీ గదులను అందిస్తుంది. పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఇక్కడ సేవలను వినియోగించుకోవచ్చు.

Also Read : అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

* సుదీర్ఘ చరిత్ర
అరుణాచలేశ్వరుడికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు( Lord Shiva) అగ్ని లింగంగా ఉంటాడు. అగ్ని అంటే జ్వాల. ఇక్కడ మిగతా పంచభూత లింగాలలా శివుడు అగ్ని రూపంలో కనిపించడు. కేవలం రాత్రి లింగం గానే ఉంటాడు. కానీ ఆలయంలో మాత్రం చాలా వేడిగా ఉంటుంది. జ్ఞానం వల్ల కర్మలన్నీ తొలగిపోతాయి. మళ్లీ జన్మించాల్సిన అవసరం ఉండదు. పాపాలన్నీ తొలగిపోతాయి కూడా. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్ని లింగం అంటారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. మిగతా రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం ఇక్కడ సత్రాలు ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఆర్యవైశ్య సంఘం ఇక్కడ సత్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

* గిరి ప్రదక్షిణ ప్రత్యేకం..
అరుణాచల క్షేత్రంలో జరిగే గిరి ప్రదక్షణకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇక్కడ గిరి ప్రదక్షణ చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి అన్నది ఒక నమ్మకం. కోరికలు తీరుతాయి కూడా అని భక్తులు ఎక్కువగా నమ్ముతుంటారు. ఆధ్యాత్మిక సాధన చేసేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షి సూచించిన సంగతి తెలిసిందే. ఇక్కడ గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్ల మేర ఉంటుంది. చెప్పులు లేకుండా గిరి ప్రదక్షణ చేయాలి. ఈ ఆలయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి తెరుస్తారు. రాత్రి 9 గంటలకు మళ్లీ మూసేస్తారు. పౌర్ణమి నాడు మాత్రం భక్తుల దర్శనం అయ్యేవరకు తెరిచే ఉంచుతారు. అయితే తెలుగు భక్తుల కోసం వాసవి సంఘం ఇక్కడ సత్రం అందుబాటులోకి తేవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version