Good news for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. రెండు కొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా నెల్లూరు, అనకాపల్లి మీదుగా.. బెంగళూరు- బాలుర్ మధ్య రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని బాలు ఘాట్ మధ్య ఈ రెండు రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. ఈరోజు నుంచి వాటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రయాణ భారం తగ్గనుంది. ఇటు బెంగళూరు వెళ్లాలన్నా.. అటు కోల్కత్తా వెళ్లాలన్నా.. ఈ రెండు రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
* రైలు నంబర్ 16523 బెంగళూరు నుంచి బాలుర్ ఘాట్ ప్రతి బుధవారం ఉదయం 10 :15 గంటలకు బెంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది.
* నెల్లూరు,ఒంగోలు, చీరాల,తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, బరంపూర్ మీదుగా బెంగాల్లోని బాలుర్ ఘాట్ కు చేరుకుంటుంది.
* రైలు నెంబర్ 16524 రైలు బాలుర్ ఘాట్ లో శనివారం బయలుదేరుతుంది. సోమవారం ఉదయం మూడు గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
* దాదాపు ఏపీలోని పది జిల్లాల ప్రజలకు ఈ రెండు రైళ్లు ప్రయాణ భారాన్ని తగ్గించనున్నాయి.
* అయితే ఇటీవల సంక్రాంతికి రైళ్లు రద్దీగా నడిచాయి. అయితే సంక్రాంతి తరువాత.. ఈ వీక్లీ రైళ్లు అందుబాటులోకి రావడం విశేషం.