https://oktelugu.com/

Kakinada : తీరంలో బంగారం.. ఇసుకలో వేట.. ఏపీలో ఎగబడుతున్న జనాలు!

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో? లేదో? తెలియదు కానీ.. ఆ సముద్ర తీరం నుంచి మాత్రం బంగారం కొట్టుకొస్తుండడం విశేషం. దానిని కైవసం చేసుకునేందుకు జనాలు తీర ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 25, 2024 / 11:43 AM IST

    Gold in uppada Beach

    Follow us on

    Kakinada :  ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో ఓ కామెడీ సీన్ ఇట్టే నవ్విస్తుంది. తెనాలి నుంచి కుటుంబంతో కాశీ వెళ్లే ఏవీఎస్ కుటుంబాన్ని మోసం చేస్తుంది బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం బృందం. గంగా నదిలో బంగారం మూట పెడితే డబుల్ అవుతుందని నమ్మించి మోసం చేస్తుంది బ్రహ్మానందం బృందం. అయితే నమ్మకం ఎంత పనైనా చేయిస్తుంది. ఆ గుడ్డి నమ్మకంతోనే మోసపోతుంది ఏవీఎస్ కుటుంబం. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో అటువంటి ఘటన అని చెప్పలేం కానీ.. సముద్రం నుంచి తీరానికి బంగారం కొట్టుకొస్తుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ప్రజల్లో ఆశలు పెంచుతోంది. దీంతో నది తీరానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

    * బంగారం పై మక్కువ
    ఇప్పుడు సమాజంలో అత్యంత విలువైనది బంగారం. ఇంట్లో బంగారం ఉంటే భవిష్యత్తుకు భరోసాయే. రోజురోజుకు బంగారం ధర పెరుగుతుండడంతో ఎక్కువమంది పసిడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అటువంటి బంగారం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం నుంచి కొట్టుకొస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో అక్కడి ప్రజలు తీరంలో బంగారం వెతికే పనిలో పడ్డారు. స్థానికులు అయితే బంగారం కోసం ఇసుకను తవ్వి జల్లెడ పడుతున్నారు. అదృష్టవశాత్తు కొంతమందికి బంగారు నాణేలు, చిన్న బంగారం ముక్కలు దొరుకుతున్నాయి. అయితే ఈ బీచ్ లో బంగారం దొరుకుతుండడం పై రకరకాల కథనాలు ఉన్నాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతంలో ఉన్న చాలా రకాల ఆలయాలు కొట్టుకుపోయాయి. అప్పుడే బంగారం తో పాటు ఆభరణాలు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు తుఫాన్ గాలులతో తీరానికి కొట్టుకు వస్తున్నాయి అన్నది ఒక వాదన.

    * అప్పట్లో కొట్టుకు రావడంతో
    గతంలో చాలా రకాల తుఫాన్లు సంభవించాయి. 2020లో నివార్ తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో పుదుచ్చేరి, చెన్నై తో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. చెన్నై పరిసరాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తుఫాను కారణంగా తమిళనాడు నుంచి ఉప్పాడ ఒడ్డుకు బంగారం కొట్టుకు వచ్చింది అన్నది ఒక వాదన. అప్పట్లోసముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు బంగారం పూసలు దొరికాయి. రెండు రోజుల కిందట తాజాగా బంగారు నగలతో పాటు చిన్న బంగారు ఆభరణాలు కనిపించాయి. ఇది ఈ నోటా ఆ నోటా వినిపించడంతో ప్రజలు బంగారం కోసం వెతకడం ప్రారంభించారు. అయితే ఈ వేటలో కొందరికి చిన్న చిన్న బంగారం ముక్కలు దొరకడంతో మరింత మంది.. వెతకడం ప్రారంభిస్తున్నారు. దీంతో తీరంలో బంగారం దొరుకుతున్న వారు అదృష్టవంతులుగా మారుతున్నారు.