Ghanta Ravi Teja : రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడు( Mini mahanadu ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు టిడిపి శ్రేణులు. అందులో భాగంగా విశాఖలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది ఆ కార్యక్రమం. కార్యక్రమానికి మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు, యువనేత గంట రవితేజ హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా సబికుల ముందుకు వచ్చి రవితేజ ఇచ్చిన నినాదాలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో రవితేజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కార్యకర్తల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు, లోకేష్ పై చేసిన నినాదాలు వైరల్ అయ్యాయి. కార్యకర్తలు కూడా రవితేజతో గొంతు కలపడంతో పెద్ద అపశృతి దొర్లింది. ఆ తర్వాత జరిగిన పొరపాటున గుర్తించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది.
Also Read : తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి
* వచ్చే ఎన్నికల్లో బరిలో రవితేజ..
ఈ ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు( Ghanta Srinivasa Rao ). వచ్చే ఎన్నికల్లో ఆయన తప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. రాజకీయ వారసుడిగా కుమారుడు రవితేజను బరిలో దించుతారని తెలుస్తోంది. ఆయన పోటీ చేయడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. అందుకే టిడిపి కార్యక్రమాల్లో గంటా రవితేజ చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో గంటా రవితేజ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని లైన్ క్లియర్ చేస్తారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా భీమిలి నియోజకవర్గంలో రవితేజ అన్ని తానై వ్యవహరిస్తున్నారు కూడా.
* మినీ మహానాడులో నినాదాలు..
మినీ మహానాడు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు. నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా సభికుల ముందుకు వచ్చారు రవితేజ( Ravi Teja). ఈ క్రమంలో ఆయన చేసిన నినాదాలు శృతిమించాయి. జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్ అంటూ రవితేజ అనడంతో టిడిపి శ్రేణులు కూడా అనుసరించాయి. కొద్దిసేపు అలానే నినదించేసరికి జరిగిన తప్పిదాన్ని కొందరు గుర్తించారు. దానిని సరి చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జోహార్ ఏంటి చండాలంగా అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. వైసిపి సోషల్ మీడియా మాత్రం అదే పనిగా ఈ వీడియోను వైరల్ చేస్తోంది.