Chandrababu And Pawan
Chandrababu And Pawan: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు కూటమిలో విభేదాలకు అవకాశం కల్పించాయి. ముఖ్యంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపించింది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలన్న డిమాండ్ జనసేన నుంచి వచ్చింది. దీంతో రెండు పార్టీలు అలెర్ట్ అయ్యాయి. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇకనుంచి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చాయి. అయితే అప్పటినుంచి పరిస్థితి మాత్రం మారింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వేదిక పంచుకోవడం తక్కువ అయ్యింది. మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. మరోవైపు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమీక్షకు సైతం హాజరు కాలేదు. దీంతో చంద్రబాబుతో గ్యాప్ బాగా పెరిగింది అన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
* విభేదాలు ఉన్నాయని ప్రచారం
అయితే వారి మధ్య గ్యాప్ ఉన్న మాట తెలియదు కానీ.. అదే పనిగా విభేదాలు వచ్చాయని మాత్రం ప్రచారం చేస్తున్నారు. గత మూడు రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనలో ఉన్నారు. తమిళనాడుతో పాటు కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. అయితే ఈరోజు ఆయన చంద్రబాబును కలుసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అది సమావేశం కాదని.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొంటారని తెలుస్తోంది. అయితే అది చంద్రబాబు భార్య భువనేశ్వరి ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడం గమనార్హం.
* ఈరోజు విజయవాడలో భారీ ఈవెంట్
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్( NTR trust) ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు భారీ ఈవెంట్ జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు కోసం ఐదు లక్షల రూపాయల నగదు ఇచ్చి ఈవెంట్ టికెట్లను తీసుకున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం ఆహ్వానం పంపినట్లు భువనేశ్వరి( Nara bhuvneshwari ) చెప్తున్నారు. ఆయన తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలో జరిగే ఈవెంట్ కు హాజరు కానున్నారు.
* తొలి విడత సందర్శన పూర్తి
అయితే తొలి విడత ఆలయాల సందర్శన ఈ రోజుతో పూర్తి కానుంది. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). ఇంకోవైపు ఆలయాల సందర్శన తన ప్రైవేటు కార్యక్రమమని కూడా ఆయన ప్రకటించారు. నేరుగా తమిళనాడు నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకోనున్నారు. భారీ ఈవెంట్ కు హాజరుకానున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత చంద్రబాబుతో వేదిక పంచుకోనున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఆ ఈవెంట్ ప్రారంభం కానుంది.