Ganta Srinivasa Rao slams YSRCP: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవమానాలు, శాంతిభద్రతల విఘాతం వంటి వాటిపై శాసనసభలో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అప్పటి ఘోరాలను వివరిస్తూ ఎమ్మెల్యేలు వైసిపి పై విరుచుకుపడుతున్నారు. అప్పట్లో సినీ ప్రముఖులకు జరిగిన అవమానం గురించి బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కామెంట్స్ చేశారు. దీంతో నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అప్పట్లో జరిగిన పరిణామాల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అది వివాదంగా మారింది. అయితే శాంతి భద్రతలపై జరిగిన చర్చలో మాత్రం సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, చర్యలతో ఒక మంచి మిత్రుడు ని కోల్పోయాను అంటూ శాసనసభ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నలంద కిషోర్ (Nalanda Kishore)అనే వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జి తో పాటు విశాఖ మంత్రిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్టు వచ్చింది. దానిని స్నేహితులకు షేర్ చేసిన పాపానికి నలంద కిషోర్ ను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా విచారణ చేపట్టేందుకు అవకాశం ఉన్నా.. ఆయనను రోడ్డు మార్గంలో.. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా.. కర్నూలు తీసుకెళ్లి విచారించారు. తరువాత బెయిల్ పై విడుదల చేశారు. అయితే ఈ అక్రమ అరెస్టుతో నలందా కిషోర్ కృంగిపోయారు. తరువాత ఆయనకు కరోనా సోకింది. చికిత్స పొందుతూ గుండెపోటు వచ్చి మృతి చెందారు. కేవలం వైసీపీ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు అప్పట్లో అలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.
అత్యంత సన్నిహితుడు..
నలంద కిషోర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు( Ghanta Srinivasa Rao ) సన్నిహితుడు. అప్పటి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును షేర్ చేసిన పాపానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుంది. విశాఖకు చెందిన ప్రముఖ వ్యక్తి కావడం, గంటా శ్రీనివాసరావుకు సన్నిహితుడు కావడంతో అప్పట్లో ఈ చర్యలకు దిగారు. నిన్న శాసనసభలో శాంతిభద్రతలపై చర్చించే క్రమంలో.. తన సన్నిహితుడు నలందా కిషోర్ ను గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భావోద్వేగంతో మాట్లాడారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.