Sunkari Valasayya success story: విద్యాధికులు సైతం అమెరికా వెళ్లడం ఇప్పుడు కష్ట సాధ్యం. ట్రంప్ దెబ్బతో అమెరికాలో( America) విద్య అంటేనే కష్టమైపోతున్న రోజులు ఇవి. కానీ ఇంటర్ ఫెయిల్ అయి.. టైపిస్టు ఉద్యోగం చేసుకుంటూ.. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాడు ఓ తెలుగు పౌరుడు. విశాఖ టు అమెరికాకు వెళ్లి అగ్రరాజ్యంలో ఉన్నత కొలువు సాధించాడు. ఆయన సక్సెస్ స్టోరీ ఒక్కసారి చదువుదాం. విశాఖ జిల్లా పద్మనాభానికి చెందిన సుంకరి వలసయ్య అమెరికాలోని ప్రముఖ బ్యాంకులో ఉన్నత పదవి చేపట్టి ఇటీవలే రిటైర్ అయ్యాడు. ఆయన చదువుకున్నది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. ఆయన సక్సెస్ స్టోరీ గురించి కుమారుడు సుధీర్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రస్తుతం సుధీర్ కుమార్( Sudheer Kumar) చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సారాంశం ఇలా ఉంది.’ ఇటీవల మా నాన్నగారు 50 ఏళ్ల ఉద్యోగ జీవితానికి గుడ్ బై చెబుతూ పదవీ విరమణ చేశారు. 1975లో టైపిస్టుగా తన మొదటి ఉద్యోగం లో చేరి.. 2025లో అమెరికాలోని బోస్టన్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పదవీ విరమణ చేశారు. ఆయన జీవిత ప్రయాణం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఏం సాధించారు? అని చెప్పడానికి అద్భుతం అనే మాట కూడా సరిపోదనిపిస్తోంది ‘ అంటూ వ్యాఖ్యానించారు కుమారుడు సుధీర్ కుమార్.
అలా హైదరాబాదు నుంచి అమెరికాకు..
వలసయ్య( valasayya ) 1975లో ఇంటర్మీడియట్ చదువుకున్నారట. అయితే ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో హైదరాబాదులో ఉన్న ఇంటర్ బోర్డు అధికారులను కలిసేందుకు వచ్చారు. అలా హైదరాబాదులోనే ఉండి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తర్వాత ఫుల్ టైం ఉద్యోగం సంపాదించుకున్నారు. ICRISAT లో ఫీల్డ్ హెల్పర్ గా చేరారు. అది అంతర్జాతీయ సంస్థ. అప్పట్లోనే అక్కడ పనిచేస్తూ కంప్యూటర్లు, స్క్రిప్టింగ్/ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. అలా అదే సంస్థలో పనిచేస్తూ ఉండగా 1998లో ఆయనకు అమెరికాలో అవకాశం వచ్చింది. అలా అమెరికాలో అడుగుపెట్టిన ఆయన 2000లో బస్టాండ్ లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేరారు. ఆ సంస్థలో అంచలంచలుగా ఎదుగుతూ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు అమెరికా వెళ్లడం కష్ట సాధ్యం అవుతుంది. అటువంటిది మూడు దశాబ్దాల కిందట నేరుగా అమెరికా వెళ్లడమే కాదు. అక్కడ ప్రఖ్యాత బ్యాంకులో ఉద్యోగం సాధించారు. 12వ తరగతిలో ఫెయిల్ అవ్వడం నుంచి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా రిటైర్ అవ్వడం స్ఫూర్తిదాయకమైన జీవితం. అదే విషయాన్ని ఆయన కుమారుడు సోషల్ మీడియాలో పంచుకొని తన తండ్రి గొప్పతనాన్ని చాటి చెబుతూ ఆనందం చెందుతున్నాడు.
Earlier this year, after 50 phenomenal years of working, my father retired from his work. His first job in 1975 was as a typist. He retired in 2025 as Senior Vice President in Bank of America in Boston, USA.
I wanted to share his remarkable journey. Sometimes I even feel that… pic.twitter.com/ZifuIJBDTY
— S. Sudhir Kumar (@ssudhirkumar) December 19, 2025