https://oktelugu.com/

TTD: తిరుమలలో వృద్ధులకు ఉచిత దర్శనం ఉత్తముచ్చటే.. అసలు నిజం వెలుగులోకి..

కలియుగ దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం తిరుమల. ఏడు కొండలపై కొలుదీరిన స్వామివారి దర్శనానికి సగటున నిత్యం లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారిలో అన్ని వయసుల వారు ఉంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 6, 2024 / 03:55 PM IST

    TTD

    Follow us on

    TTD: తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం.. ప్రపంచంలో ఎక్కువ మంది దర్శించే ఆలయాల్లో ఒకటి. ఇక్కడికి ఏటా లక్ష మందకిపైగా వస్తుంటారు. ఏటా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగునంగా ఏపీ ప్రభుత్వం, టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక తిరుమలకు వచ్చే భక్తుల్లో ఏడాది బాలుడి నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉంటారు. దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు కూడా స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఇలాంటి వారికి ఇబ్బంది కలుగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులకు ఉచిత దర్శన కల్పించారు. వృద్ధులతోపాటు ఒక అటెండర్‌ను దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి నుంచి వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు తిప్పలు తప్పాయి. ఏడుకొండలవాడి దర్శనం సులభమైంది. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు కూడా దానిని కొనసాగించారు. దీంతో తిరుమల వచ్చే వృద్ధుల సంఖ్య పెరిగింది. కొంత మంది అటెండర్లు త్వరగా శ్రీవారి దర్శనం కోసం వృద్ధులను వెంట తీసుకొస్తున్నారు. దీంతో అక్కడ కూడా రద్దీ పెరిగింది.

    ఆన్‌లైన్‌ చేసిన జగన్‌..
    తిరుమలలో వృద్ధుల రద్దీ పెరుగుతుండడంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రద్దీ తగ్గించేందుకు చర్యలు చేపట్టింది, ఇందులో భాగంగా వృద్ధుల దర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌ చేసింది. దీనిని చాలా మంది వ్యతిరేకించారు. జగన్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని విపక్షాలు ఆరోపించాయి. కానీ, దానిని తీసుకు వచ్చిందని భక్తుల కోసమే అనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేదు.

    అదే విధానం కొనసాగింపు..
    ఇక ఏపీలో ఇటీవల టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆయన తొలి ప్రసంగంలో ప్రక్షాళన తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే అంతా పాత విధానం అమలవుతుందని అనుకున్నారు ఈమేరకు ఆయన అనుకూల మీడియా కూడా కథనాలు రాసింది. కానీ, చంద్రబాబు పాలనలో కూడా జగన్‌ తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ విధానమే కొనసాగుతోంది. దీనిని తీసివేస్తే.. తిరుమలకు తండోపతండాలుగా తరలివస్తారు. దీంతో వచ్చిన వృద్ధులు, వారివెంట ఉన్న అటెండర్లకు దర్శనం కల్పించడం కష్టంగా మారింది. దీంతో ఆయన కూడా కొనసాగిస్తున్నారు.

    రద్దీ నేపథ్యంలోనే…
    తిరుమలకు ఏటా భక్తులు పెరుగుతున్నారు. సెలవు రోజులు, వేసవిలో, బ్రహ్మోత్సవాల వేళలో అయితే భారీగా భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అనేక మార్పులు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపు సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. అయినప్పుటికి సర్వ దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుమలకు వస్తున్నారు. వారంతా కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వీరికి అప్పటికప్పుడే టికెట్లు ఇస్తారు. ఇక మిగతా అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు కూడా గతంలో అక్కడి వచ్చిన వారందరికీ దర్శనం కల్పించారు. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చేవారు పెరిగారు. నేపథ్యంలోనే ఈ టికెట్లను కూడా టీటీడీ ఆన్‌లైన్‌ చేసింది.