Free Bus Travel AP: ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఇకపై ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే విధులు బాటు ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానుందని చెప్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ అధికారులు ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్య హామీని కూడా చంద్రబాబు సర్కారు పూర్తి చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం పాలనలోకి వచ్చిన సమయం నుంచి ప్రతినెల 1వ తేదీన పెంచిన పింఛన్లను ప్రతినెలా క్రమం తప్పకుండా అర్హులకు అందిస్తున్నారు.
Also Read: ఐఎస్‌ఐ గూఢచారిగా హర్యానా యూట్యూబర్.. భారత సైనిక రహస్యాల బహిర్గతం!
అలాగే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మహిళల ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమానికి కూడా ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం కార్యక్రమంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు క్రమం తప్పకుండా పడేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో డీఎస్సీ రిక్రూట్మెంట్ కు కూడా అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవి సెలవులు ముగిసిన తర్వాత నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు కూడా శుభవార్త తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ సొమ్ములకు సమానంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించండి అని పిలుపునిచ్చారు. ఇల్లు పరిసరాల శుభ్రతపై ప్రతినెల మూడో శనివారం దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ప్రపంచం మొత్తం మెచ్చుకునేలాగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను కూడా త్వరలో నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.