spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YSRCP EX MLA : నాలుగు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. 31 కోట్ల భూ...

YSRCP EX MLA : నాలుగు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. 31 కోట్ల భూ వ్యవహారం.. ఇలా బయటకొచ్చింది..

YSRCP EX MLA : ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ అడిగారు. చంద్రబాబు కుదరదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయన ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. అక్కడ పొలిటికల్ ఫ్యూచర్ లేదని అర్థమైంది. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. ఏం మాయ చేసారో తెలియదు.. టికెట్ వచ్చింది.. ఎమ్మెల్యే అయ్యారు.

ఎమ్మెల్యే అయిన తర్వాత నోటికి పని చెప్పారు. చేతికి కూడా పని చెప్పారు. ఏపీలో తన నియోజకవర్గ పరిధిలో భూ వ్యవహారాలలో అంతకుమించిన పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణలో గండిపేట ప్రాంతాన్ని తనకు స్థావరం గా మార్చుకున్నారు. అక్కడ చాలావరకు భూములను కొనుగోలు చేశారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారు. 10 సంవత్సరాలపాటు భారత రాష్ట్ర సమితి నాయకులతో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయన భూ అతిక్రమణలకు అడ్డు లేకుండా పోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది.. ఈయన మీద ఫోకస్ పడింది. భూ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించడంతో ఈయన అక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ మాజీ ఎమ్మెల్యే మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు తర్వాత వైసిపి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈయనతో తమ పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించింది. అరెస్టు కాకముందు ఈ మాజీ ఎమ్మెల్యే తన నోటికి పని చెప్పారు. ఇటీవల టీీడీపీ ఎంపీ మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన చేయని పనులు కూడా చేసినట్టు చెప్పారు..

సహజంగానే ఆ ఎంపీ సాత్వికుడు. పెద్దగా పరుష పదజాలం ఉపయోగించరు. కానీ ఓ మీడియా సంస్థ ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ఎంపీ తెరమీదకి వచ్చారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే భూభాగోతాలను ఏకరవు పెట్టారు. అక్కడితో ఆ ఎంపీ ఆగలేదు. సదరు మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలో ఒక భూమి వ్యవహారంలో వేలు పెట్టిన విషయం.. ఆ భూమిని తిరిగి ఇచ్చేయడానికి 31 కోట్లు వసూలు చేసిన విషయాన్ని ఆ ఎంపీ బయటపెట్టారు. పైగా ఈ డబ్బులను రామోజీ ఫిలిం సిటీ వెనుక ఉన్న ఓ ప్రాంతంలో తీసుకున్నట్టు ఆ ఎంపీ సాక్షాలతో సహా బయటపెట్టారు. 31 కోట్లను వసూలు చేసిన నేపథ్యంలో ఈడికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని.. ఆ తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే ముఖచిత్రం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాను అంటూ ఆయన అనుచరులకు ఆ ఎంపీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఎంపీ మాట్లాడిన మాటలు.. ఆ మాజీ ఎమ్మెల్యే భూమి వ్యవహారాలకు సంబంధించిన వివరాలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version