Kethireddy Pedda Reddy Arrested: రాయలసీమ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు తాడిపత్రి( Tadipatri). అక్కడ నిత్యం రాజకీయాలు హాట్ హాట్ గానే ఉంటాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా కూడా. అక్కడ జెసి కుటుంబం రాజకీయాలు నడుపుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప.. అక్కడ ఆ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే అక్కడ జెసి కుటుంబానికి ధీటుగా నిలిచింది కేతిరెడ్డి కుటుంబం. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కేతిరెడ్డి కుటుంబం జెసి కుటుంబానికి నిత్యం సవాల్ విసిరేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారింది. కేతిరెడ్డి కుటుంబం పై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్టుతో కలకలం రేగింది.
Also Read: గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో
* 2019లో గెలిచిన పెద్దారెడ్డి..
2019 ఎన్నికల్లో జెసి కుటుంబంపై గెలిచారు కేతిరెడ్డి పెద్దారెడ్డి( Pedda Reddy). అప్పటినుంచి తాడిపత్రి నియోజకవర్గం పై పట్టు సాధించాలని చూశారు. అయితే మధ్యలో మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీ కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. జెసి ప్రభాకర్ రెడ్డి పట్టుదలతో ఇక్కడ గెలిచి చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం వీచింది. కానీ తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అప్పటినుంచి తాడిపత్రి మరింత హీట్ ఎక్కింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతూ వచ్చాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉండేది.
* కూటమి గెలుపుతో..
2024 ఎన్నికల్లో జెసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) కుమారుడు చేతిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. ఈ క్రమంలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాకూడదని ఆంక్షలుపెట్టారు. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వివాదాస్పద ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు ఆయనను తాడిపత్రి పట్టణం నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. తమ అనుమతి లేకుండా తాడిపత్రిలోకి రావద్దని ఆంక్షలు పెట్టారు. అయితే పెద్దారెడ్డి కోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చానని చెబుతున్నారు. కానీ పోలీసులు ఆయనను బలవంతంగా తాడిపత్రి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. పెద్దారెడ్డి చాలా వరకు ప్రతిఘటించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
తాడిపత్రిలోని తన ఇంట్లో ఉండరాదంటూ.. బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించిన పెద్దారెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు pic.twitter.com/lnNrg1uf9O
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2025