Former minister Vidadala Rajini: రాజకీయాలు మునుపటి మాదిరిగా లేవు. ఇక్కడ విశ్వాసం, విధేయతతో పని ఉండదు కూడా. దశాబ్దాల కిందట అలా ఉండేది కానీ ఇప్పుడు రాజకీయాలు ట్రెండ్ మారాయి. దానికి తగ్గట్టు నేతలు వ్యూహాలు మారుతున్నాయి. అవసరాన్ని బట్టి పార్టీ మార్చే నేతలు, అవసరాన్ని బట్టి అవకాశాలు ఇచ్చే పార్టీలు ఎక్కువయ్యాయి. రాజకీయ పార్టీలు మారాయి. నేతలు అలానే మారారు. ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మాజీ మంత్రి విడదల రజిని ఇప్పుడు పార్టీ మారుతారని తెలుస్తోంది.
స్వల్ప కాలంలో పదవులు..
వైయస్సార్ కాంగ్రెస్( y s r Congress ) పార్టీలో అదృష్టవంతురాలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విడదల రజనీది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. ఆపై మంత్రి.. కీలక పోర్టు పోలియో.. ఇలా ఎలా చూసుకున్నా ఆమె అదృష్టవంతురాలు. అయితే ఎంత వేగంగా పదవులు వచ్చాయో.. అంతే వేగంగా వివాదాలు కూడా చుట్టుకున్నాయి. ప్రజా వ్యతిరేకతను సైతం మూటగట్టుకున్నారు.. అయితే ఆమెపై ప్రజా వ్యతిరేకత ఉందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. చిలకలూరిపేటలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె గుంటూరు వెళ్లినా ఓటమి తప్పలేదు. తిరిగి చిలకలూరిపేటలో రాజకీయాలు మొదలు పెట్టాలనుకున్నారు ఆమె. ఇక్కడ కాదు రేపల్లె వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి సూచించేసరికి ఆమె షాక్ తిన్నారు. నా చరిష్మతోనే గెలిచావు అని సంకేతాలు ఇవ్వగలిగారు జగన్. ఆ విషయం తెలిసేసరికి ఆమెకు మైండ్ బ్లాక్ అయింది. అందుకే ఇక్కడ ఉండకూడదు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జనసేన ఏకైక ఆప్షన్..
నేను సైబరాబాద్ మొక్కను అంటూ చంద్రబాబును భలేగా నమ్మించారు. అందుకే ఇప్పుడు టిడిపిలోకి వెళ్దామంటే కుదరదు. వెళ్లడానికి వీలు లేదు కూడా ఆమెకు. అందుకే ఆమె చూపు జనసేన వైపు పడినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇటువంటి ప్రచారం కొత్త కాదు. గతంలో కూడా ఇటువంటి ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే తనకంటూ ఒక నియోజకవర్గంలో ఉంచకుండా జగన్మోహన్రెడ్డి అన్నిచోట్ల తిప్పుతుండడంపై ఆమె ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో సరైన అవకాశం కల్పిస్తానంటే జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ విషయంలో ఓ మాజీ మంత్రి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అదే జరిగితే ఆమె పొలిటికల్ కెరీర్లో జనసేన అనేది మూడో పార్టీ అన్నమాట.