Chandrababu tenure: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) విమాన ఖర్చులు అధికంగా పెడుతున్నారా? దుబారా ఖర్చులు చేస్తున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా సాక్షి మీడియాలో.. చంద్రబాబు విమాన ఖర్చులు ఏడాదికి 55 కోట్ల రూపాయలు అని రాసుకొచ్చింది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారు అన్నది మాత్రం బయట పెట్టలేదు. అయితే ఆయన 2023-24లో ఖర్చు పెట్టింది అక్షరాలా 50 కోట్ల రూపాయల పై మాటే. కానీ ఇప్పుడు చంద్రబాబు తరచూ విజయవాడ, హైదరాబాద్ మధ్య హెలికాప్టర్, ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ వినియోగిస్తున్నారు అన్నది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఆయన భార్య భువనేశ్వరి తో పాటు కుటుంబం హైదరాబాదులో ఉండడంతో రెండు వారాలకు ఒకసారి ప్రయాణిస్తున్నారు అన్నది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
జగన్ హయాంలోనూ అంతే..
ప్రధానులతో పాటు ముఖ్యమంత్రులు హెలికాప్టర్లు, చార్టర్ ఫ్లైట్లు వినియోగిస్తున్నారు అన్నది సర్వసాధారణం. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే విమాన ఖర్చులు ఏపీలో( Andhra Pradesh) అధికంగా ఉంటున్నాయి అన్న విమర్శ ఉంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మధ్య వ్యత్యాసం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి బయట పర్యటనలు చాలా తక్కువ. తొలి రెండున్నర సంవత్సరాలు ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటి రాలేదు. కానీ సంక్షేమ పథకాల బటన్ నొక్కాేందుకు మాత్రం ప్రత్యేక హెలికాప్టర్ తో పాటు విమానాల్లో వెళ్లేవారు. విదేశీ పర్యటనలకు కానీ, పెట్టుబడుల అన్వేషణకు కానీ వెళ్లేవారు కాదు. అయితే ఎక్కువగా ప్రైవేటు పర్యటనలకు సంబంధించి కూడా ప్రత్యేక విమానాలు వాడే వారన్న విమర్శ ఉంది. అప్పట్లో తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లాలన్నా.. గుంటూరు వెళ్లాలన్నా.. రోడ్డు మార్గం ద్వారా కాకుండా.. ఆకాశమార్గంలో వెళ్లేవారు అన్నది ఒక విమర్శ. అయినా సరే చంద్రబాబు హయాంలో విమాన ఖర్చులతో సమానంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు చేశారు. కానీ అది సాక్షి మీడియాకు కనిపించదు. కనిపించినా కథనాలు వేయరు.
విదేశీ పర్యటనలు అధికం..
చంద్రబాబు ఎక్కువగా విదేశీ పర్యటనలకు( foreign Tours ) వెళ్తారు. వరుసగా రెండుసార్లు దావోస్ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు. సింగపూర్, అమెరికా, లండన్ వంటి దేశాల్లో పర్యటించారు. అయితే అవి వ్యక్తిగత పర్యటనలు కాదు. రాష్ట్రం కోసం చేసిన పర్యటనలు. మంత్రులతో పాటు అధికారుల బృందం కూడా ఆయనను అనుసరిస్తుంది. అటువంటి సమయంలో ప్రత్యేక విమానాలను వినియోగించుకోవడం అనేది సర్వసాధారణం. మరోవైపు ఢిల్లీ పర్యటనలకు తరచూ వెళ్తుంటారు చంద్రబాబు. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకునేందుకుగాను తరచూ హస్తినా వెళుతుంటారు. ఆపై సంక్షేమ పథకాల అమలు… ప్రతి నెల ఒకటో తేదీ సామాజిక పింఛన్లు పంపిణీకి ఏదో ఒక జిల్లాకు వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అందుకే విమాన ఖర్చులు, ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఇలాంటివి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి హయాంలో సైతం అదే స్థాయిలో ఖర్చులు ఉండడం మాత్రం గమనార్హం.