Fertility Rate: ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గుతోంది. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేసేవి. అధిక నజాభాతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేవి. కానీ ఇప్పుడు జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన వచ్చింది. కానీ, నియంత్రించాల్సిన జననాలు కూడా ఈ రోజుల్లో జరగడం లేదు. పెరుగుతున్న టెక్నాలజీ, రేడియేషన్, పని ఒత్తిడి తదితర కారణాలతో పిల్లలు పుట్టడం తగ్గుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు ఓ సర్వే సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు భారీగా పడిపోయిందట. ఇది జనాభా స్థిరత్వానికి ఆందోళనకరమైన సంకేతం. ఫర్టిలిటీ రేటు పడిపోవడానికి పురుషులు, స్త్రీలు సమానంగా కారణమని సర్వేలు చెబుతున్నాయి.
పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్పెర్మ్ కౌంట్ పతనం
అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు, స్పెర్మ్ సంఖ్య తగ్గడం ప్రధాన కారకం. ఆధునిక జీవనశైలి దోషాలు దీనికి కారణం. ఉదాహరణకు, నిద్రాభావం, మానసిక ఒత్తిడి ఈ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. సర్వేలు ప్రదేశంలోని యువకుల్లో ఈ లక్షణాలు విస్తృతంగా కనిపిస్తున్నాయని వెల్లడిస్తున్నాయి.
జీవనశైలి ఆరోగ్యానికి ముప్పు
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు హార్మోన్లను దెబ్బతీస్తాయి. బాహ్య ఆహారాలు, పోషకాహార లోపం స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. ల్యాప్‌టాప్‌లను తొడలపై ఎక్కువసేపు ఉంచడం వేడి ప్రభావంతో సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇది స్త్రీపురుషుల్దిరిలోనూ ప్రభావం చూపుతుంది.
సహజ పరిష్కారాలు..
సమస్యలను తగ్గించడానికి 7–8 గంటల నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం కీలకం. విటమిన్ సి, ఈ, బి12, జింక్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చాలి. అశ్వగంధ, మకా రూట్, మెంతుల గింజలు వంటి సహజ సప్లిమెంట్లు సహాయపడతాయి. ఒత్తిడి నిర్వహణ కోసం ధ్యానం, యోగా సిఫార్సు.
ఈ ట్రెండ్ జనాభా పిరమిడ్‌ను ప్రభావితం చేసి, వృద్ధాప్య సమస్యలకు దారితీస్తుంది. ప్రభుత్వాలు, వైద్యులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యక్తిగతంగా జీవనశైలి మార్పులు చేస్తే ఫలవంతత పెరగవచ్చు. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.