https://oktelugu.com/

Fengal Cyclone: ఫెంజల్‌ ఎఫెక్ట్‌.. భారీ వర్షాలతో అక్కడ స్కూళ్లకు సెలవులు?

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్‌ తుఫాన్‌ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రద్రేశ్‌తోపాటు కర్ణాటకలోనూ వర్షాలు కురస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అతలాకుతలం అవుతున్నాయి. ఇళ్లలోని నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 2, 2024 / 11:02 AM IST

    Fengal Cyclone(1)

    Follow us on

    Fengal Cyclone: బంగాళాఖాతంలో ఐదు రోజుల క్రితం ఏర్పడిన ఫెంజల్‌ తుపాను తంజావూరు వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను థాటికి తమిళనాడు, పుదుచ్చేరి చిగురుటాకులా వణుకుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నీ జలమయామయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా. పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు, తంజావూరు, రామనాథపురం సహా తొమ్మిది జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. దీంతో విద్యాసంస్థలను మూసివేశారు.

    అతి భారీ వర్షాలు..
    తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు సహా పలుజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు ముందస్తుగా సెలవులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో సెలవుపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలసి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చాలా మంది పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. వరదలు ఉన్న రోడ్లపై ప్రయాణించొద్దని అధికారులు సూచిస్తున్నారు.

    ఏపీ, బెంగళూరుపై ప్రభావం..
    ఫెంజల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఇటు ఏపీ, అటు కర్ణాటకపై పడింది. రెండు రాష్ట్రాల్లోనూ తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కర్ణాటకలోని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం పాఠశాలలు తెరిచే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌దోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అయితే అధికారికంగా విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వలేదు.