Fake IPS Officer : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపిఎస్ అధికారి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్వతీపురం మన్యం పర్యటనలో ఉన్న సమయంలో పోలీసుల బృందంలో ఈ ఫేక్ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఫేక్ ఐపీఎస్ అధికారిగా కనిపించిన వ్యక్తి బలివాడ సూర్య ప్రకాష్ గా తేల్చారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ దిలీప్ కిరణ్ మీడియాకు వెల్లడించారు. ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. యూనిఫాంలో ట్రైనీ ఐపీఎస్ పేరుతో 41 ఏళ్ల బలివాడ సూర్య ప్రకాష్ వచ్చారని.. ఆయనను పార్కింగ్ ప్లేస్ వద్ద నిలిపివేశామని.. కానీ కొంచెం దూరం నడిచి వెళ్లి తిరిగి అదే పార్కింగ్ ప్లేస్ కు వచ్చాడని తెలిపారు.
* భూ వివాదం నేపథ్యంలో
ఓ భూ వివాదానికి సంబంధించిన అంశంలో ఆయన నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతారం ఎత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆరోజు బాగు జోలు అనే గ్రామంలో పవన్ పర్యటించిన సమయంలో పవన్ పర్యటించారు. వ్యూ పాయింట్ కి వెళ్ళాక శంకుస్థాపన స్థలం వద్దకు వెళ్లి ఫోటోలు తీసుకుని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. కొంతమంది అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అప్పట్లో పవన్ కార్యక్రమాలు ముగించుకుని వెళుతుండగా సూర్య ప్రకాష్ ఫోటోలకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
* పోలీస్ శాఖ దే బాధ్యత
సూర్య ప్రకాష్ తండ్రి దత్తరాజేరులో 9 ఎకరాల పొలం కొన్నారు. అందుకు సంబంధించి కాగితాలు రాసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఆ భూమి విషయంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు సూర్య ప్రకాష్ ఫేక్ ఐపీఎస్ గా అవతారం ఎత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి కారుతోపాటు ఐడి కార్డులు, లాప్టాప్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫేక్ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని… ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డిజిపి, హోం మంత్రి దేనిని తేల్చి చెప్పారు. తనకు పని చేయడం ఒక్కటే తెలుసని.. తన భద్రతా బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖ దేనిని పేర్కొన్నారు.