EX IAS Praveen Prakash Apology: అధికారం ఉన్నప్పుడు పెద్దగా ఏవీ కనిపించవు. ఎదుటి మనుషులు నిమిత్తమాత్రులుగా.. సర్వం వారి చేతిలో ఉన్నట్టుగా.. వ్యవస్థ మొత్తం వారు చెబితే నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి అధికారం పోతే ఆ తర్వాత వాస్తవమేమిటో అర్థమవుతుంది. కాళ్ళ కింద భూమి నిశ్చలంగా అనిపిస్తూ ఉంటుంది. పైనున్న ఆకాశం స్థిరంగా ఉన్న భావన కలుగుతుంది. సరిగ్గా ఇటువంటిదే ఆ అధికారికి ఇప్పుడు అర్థమవుతోంది. దీంతో ఆయన చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు. తను చేసిన పని ఎంతటి పనికిమాలినదో అర్థమయి తలవంచుకున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అత్యంత కీలకమైన అధికారిగా పనిచేశారు. ఒక రకంగా ఆయన ఏపీలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేశారు. అందరి అధికారుల మీద పెత్తనం సాగించారు. తనకు నచ్చని అధికారుల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కొందరిని అయితే దూరం పెట్టి కక్ష సాధింపుకు పాల్పడేవారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా చుక్కలు చూపించేవారు. అలా ప్రవీణ్ ప్రకాష్ ద్వారా ఇబ్బంది పడిన అధికారులలో ఇంటలిజెన్స్ మాజీ ఏబీ వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ ఉన్నారు. వీరిని జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టారు ప్రవీణ్ ప్రకాష్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఎంతటి ప్రమాదమో అర్థమయి.. ప్రవీణ్ ప్రకాష్ తన కెరియర్ చివరి దశలో చింతించారు. అత్యంత అవమానకరమైన దశలో బయటికి వెళ్లారు.
ఎవరికైనా సరే ఎప్పుడో ఒక సందర్భంలో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అలాంటిదే ప్రవీణ్ ప్రకాష్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. పైగా ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదని ఆయన ముఖం చూస్తే కనిపిస్తోంది. తన కెరియర్లో ఏబీ వెంకటేశ్వరరావు, కృష్ణ కిషోర్ పై వ్యవహరించిన తీరు పట్ల ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంతేకాదు వారిద్దరి పై అనుచితంగా ప్రవర్తించానని పేర్కొన్నారు. తన వల్ల వారిద్దరూ ఇబ్బంది పడ్డారని వివరించారు. అందువల్లే వారి ఇద్దరికీ బహిరంగంగా క్షమాపణ చెబుతున్నట్టు ఒక వీడియో విడుదల చేశారు. తన 30 సంవత్సరాల కెరియర్ లో ఎన్నడు కూడా అవినీతికి పాల్పడలేదని.. విలువలతో పని చేశానని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. ప్రవీణ్ ప్రకాష్ వీడియోను టిడిపి నేతలు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. జగన్ తో అంట కాగిన ఏ అధికారికైనా సరే ఇటువంటి పరిస్థితి పడుతుందని చెబుతున్నారు.
తప్పు చేశాను.. నన్ను క్షమించండి..! | EX IAS Praveen Prakash Apology TO A B Venkateswara Rao | ABN#EXIASPraveenPrakash #ABVenkateswaraRao pic.twitter.com/CBPkCPqpWQ
— ABN Telugu (@abntelugutv) November 12, 2025