Sankranthi Festivel: పండుగొచ్చిందంటే ఆ ఉత్సాహం, సరదా వేరు.. సంక్రాంతి అంటేనే ఏపీలోనే పెద్ద పండుగ.. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. పిండి వంటలు.. కొత్త బట్టలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పక్కర్లేదు.. తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చింది..

గోదారోళ్లు అంటే మర్యాద… మర్యాద అంటే గోదారోళ్లు అన్నట్లు ఉంటుంది…ఇక కొత్త అల్లుళ్లకు సంక్రాంతి మర్యాదలు అంటే చెప్పనక్కర్లేదు. మర్యాదలతో చంపేస్తారు.
Also Read: 18 ఏళ్లకే ఎంపీగా రికార్డు సృష్టించిన తెలుగమ్మాయి.. ఎక్కడంటే..?
పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త అల్లుళ్లకు 365 వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన విజయలక్ష్మీ జ్యువెల్లర్స్ అధినేత అత్యం వెంకటేశ్వరరావు మాధవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది.
పెళ్లికి ముందే సంక్రాంతి పండుగ రావడంతో పెళ్లికుమార్తె తాత అచంట గోవింద్-నాగమణి దంపతులు కాబోయే నూతన వధూవరులకు నరసాపురంలో ఆతిథ్యం సంక్రాంతి పండుగ రోజున ఇచ్చారు.
ఈ సందర్భంగా మనవడికి 365 రకాల వంటలను రుచిచూపించారు. ఇందులో వంద రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం 30 రకాల కూరలతోపాటు పిండి వంటలతో ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు.