Pawan Kalyan Birthday Wishes: ఏపీ( Andhra Pradesh) రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం నడుస్తుందని పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాకూడదని భావిస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ శ్రేణులను సైతం సముదాయిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని సైతం సమర్ధిస్తున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి నేతలు ఆడుతున్న మాటలను గుర్తు చేస్తూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గుండాయిజం చేస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు పవన్. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. దానిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి.
నాడు పరస్పర గౌరవం..
జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది నేతల మధ్య మంచి సంప్రదాయంగా నడుస్తూ వచ్చింది. అయితే కేవలం పుట్టినరోజులు నాడే కాదు బయట ఎక్కడ కనిపించినా.. అధికార ప్రతిపక్ష నేతల మధ్య గౌరవభావం ఉండేది. పరస్పరం గౌరవించుకునే వారు కూడా. రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) తో పాటు చంద్రబాబు వరకు ఈ పరంపర కొనసాగింది. కానీ ఏపీలో పొలిటికల్ ట్రెండ్ మారింది. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం ప్రారంభం అయింది. తనను అరెస్టు చేసే కుట్రలో చంద్రబాబు ఉన్నారన్నది జగన్మోహన్ రెడ్డి అనుమానం. అందుకే తన హయాంలో చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరోవైపు వ్యక్తిగత అంశాలకు సంబంధించిన దాడి కూడా జరిగింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రధాన బాధితుడు. అందుకే ఆది నుంచి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతోనే ఉంటారు.
నేతల శుభాకాంక్షలు వెల్లువ
నిన్ననే జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan), పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన చెల్లెలను ఉద్దేశించి థ్యాంక్యూ షర్మిలమ్మ అంటూ రిప్లై ఇచ్చారు జగన్. పవన్ కళ్యాణ్ విషయంలో సైతం సానుకూలంగా స్పందించారు. థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయ వేడి ఉన్న ఈ తరుణంలో.. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఓ మంచి అనుబంధం కనిపించింది నేతల మధ్య..