Duvvada Srinivasa Rao And Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాసరావు, దివ్వెల మాధురి.. ఈ కాంబినేషన్ కొంతకాలంగా తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. తనకంటే వయసులో మాధురి చాలా చిన్నది. తనకంటే శ్రీనివాసరావు వయసులో చాలా పెద్దవారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య కొంతకాలంగా సంబంధం కొనసాగుతూనే ఉంది. మాధురికి తన మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు. అయినప్పటికీ విడాకులు ఇవ్వకుండానే శ్రీనివాసరావుతో సంబంధం మొదలుపెట్టింది. శ్రీనివాస రావు కూడా మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమార్తెలు. అయినప్పటికీ అతడు కూడా ఆమెకు అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే మాధురితో కలిసి ఉంటున్నాడు.
నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. మీడియా కూడా అంతే యాక్టివ్ గా ఉంది.ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు, మాధురి విపరీతంగా ప్రకారం అందించడంలో మీడియా, సోషల్ మీడియా పోటీపడుతోంది. ఇద్దరితో ఇంటర్వ్యూలు నిర్వహించడం.. రకరకాల కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం వంటివి జరిగిపోతున్నాయి. వీటివల్ల మాధురికి, శ్రీనివాసరావుకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. చివరికి మాధురి బిగ్ బాస్ లోకి ప్రవేశించింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన సత్తా చూపించడం ప్రారంభించింది. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవస్థాపకురాళ్ళలో ఒకరైన రమ్య మోక్ష కూడా బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక వీరిద్దరి మధ్య సంవాదం జోరుగా సాగుతోంది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మాధురికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ వీడియోలో ఓ విలేకరి అడిగిన ప్రశ్న ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. “మీకు శ్రీనివాసరావులో ఏం నచ్చింది. ఆయన మీ కంటే వయసులో పెద్దవాడు కదా” అంటూ ఆ విలేకరి మాధురిని ఉద్దేశించి ప్రశ్నించారు. “పైగా ఆయన రేపో మాపో పింఛన్ తీసుకోవడానికి కూడా వెళతారు.. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు ప్రేమించారంటూ” అంటూ ఆ విలేఖరి మాధురిని ప్రశ్నించారు. దీంతో మాధురి సైలెంట్ అయిపోయారు. ఈ వీడియోను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. ఈ వీడియో వ్యవధి కొన్ని నిమిషాలు మాత్రమే అయినప్పటికీ.. పొట్ట పగిలేలా చేస్తోంది.