YSRCP Allegations On DSC: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో తడబడుతోంది. ఇంకా కుట్రపరమైన రాజకీయాలని నమ్ముకుంటోంది. అయితే వాటికి ఎల్లకాలం చెల్లుబాటు ఉండదు. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య ఇటువంటి కుట్రలతోనే కాలం గడిపారు. అప్పట్లో అవి కలిసి వచ్చాయి. ఇప్పుడు మాత్రం అవి కుదిరే పని కాదు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ 2025 పై కుట్రలు పన్నుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇస్తోంది. అదే సమయంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు బాహటంగానే ప్రకటనలు చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ప్రక్రియపై కుట్రవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటైన విద్య కాబట్టి.. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వైసిపి కుట్రలను బయటపెట్టే క్రమంలో ప్రభుత్వం పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. పరీక్ష నిర్వహణ నుంచి ఇంటర్వ్యూలు, ఎంపిక అన్నింటిలోనూ పూర్తి పారదర్శకత చూపించామని ప్రభుత్వం చెప్పింది. 16,347 మంది ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
* డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఎటువంటి శాస్త్రీయత లేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆన్లైన్ ఆధారితంగా జరిగాయని.. ప్రశ్న పత్రాలు డిజిటల్ ఫార్మేట్ లో.. జంబ్లింగ్ పద్ధతిలో స్క్రీన్‌పై వస్తాయని.. ఈ విధానంలో ఏ అభ్యర్థికి ఏ ప్రశ్న వస్తుందో తెలియదు అని.. చివరకు ప్రశ్న పత్రం తయారు చేసే సబ్జెక్టు నిపుణుడు కు సైతం పూర్తి అవగాహన ఉండని విధంగా వ్యవహరిస్తే అసలు పేపర్ లీకేజ్ ఎలా అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
* మంచి మార్కులు వచ్చినా కొంత మంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని చెబుతూ వైసిపి చూపుతున్న జాబితా పై కూడా స్పష్టతనిచ్చింది. నోటిఫికేషన్ లో అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్య.. రోస్టర్ పాయింట్లు, చట్టబద్ధమైన రిజర్వేషన్లు ప్రకారమే మెరిట్ జాబితా రూపొందించినట్లు.. ఒక సామాజిక వర్గంలో.. ఒక కేటగిరీలో పోస్టుల భర్తీ అయిన తర్వాత.. అంతకంటే తక్కువ ర్యాంకు వచ్చిన వేరే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం అనేది సర్వసాధారణం. వైసిపి చూపుతున్న అభ్యర్థుల ర్యాంకులు, వారి కేటగిరి కట్ ఆఫ్ వివరాలను బహిరంగంగా ఉంచారు.
* పరీక్షలు నిర్వహించిన ఎన్సీఈఆర్టీ ఉద్యోగి టాప్ ర్యాంకు పై జరుగుతున్న ప్రచారం కూడా ఫేక్ అని తేల్చింది ప్రభుత్వం. సదరు ఉద్యోగి అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేదు. నేరుగా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డీఎస్సీ పరీక్ష రాయాలంటే తప్పకుండా నిరభ్యంతర ధ్రువీకరణ జత పరచడం తప్పనిసరి. అది పొందుపరచలేదు కాబట్టే ఆ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ప్రశ్నపత్రల తయారీతో అభ్యర్థికి సంబంధం లేదు. ఆయన విభాగానికి, డీఎస్సీ ప్రక్రియతో అస్సలు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ప్రచారానికి తెరతీసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆరోపణలు చేయవచ్చు కానీ.. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న 16,000 మందికి పైగా రోడ్డు పైకి వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఖాయం.
