https://oktelugu.com/

Amalapuram: ఆమెది కడుపా? రాళ్ల ఖార్ఖానాన.. కడుపులో ఏకంగా 570 రాళ్లు

అమలాపురానికి సమీపంలోని దేవగుప్తం గ్రామానికి చెందిన నరస వేణి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 21, 2024 / 02:05 PM IST

    Doctors Removed 570 Stones From a Woman Stomach in Amalapuram

    Follow us on

    Amalapuram: తెలుగు ప్రాంతాలకు ఒక అరుదైన గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో రత్నాలు లభించేవి అని చరిత్ర చెబుతోంది. అందుకే రత్న గర్భ అని పేరు దక్కింది తెలుగు రాష్ట్రాలకు. అయితే ఆ మాట పక్కన పెడితే.. ఇప్పుడు రాళ్ల గర్భ అని పేరు దక్కించుకుంది తెలుగింటి ఆడపడుచు. ఆమె కడుపులో ఒకటి కాదు రెండు కాదు.. వందల కొలది రాళ్లు ఉండడం విశేషం. ఏకంగా 570 రాళ్లు ఒక మహిళా గర్భంలో వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణులకు సైతం ఆశ్చర్యం వేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

    అమలాపురానికి సమీపంలోని దేవగుప్తం గ్రామానికి చెందిన నరస వేణి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోంది. ఈ తరుణంలో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేయగా షాకింగ్ విషయం బయటపడింది. ఆమె కడుపులో 570 రాళ్లు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా తీసిన వైద్యులు.. ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

    సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడితే విపరీతమైన కడుపునొప్పి వస్తుంది.కానీ ఆమె గర్భంలోనే 570 రాళ్లు ఉండగా ఆమె ఏ స్థాయిలో బాధపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.గత కొన్నాళ్లుగా ఆసుపత్రుల్లో తిరుగుతూ వస్తున్న బాధితురాలు.. చివరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించడంతో.. అక్కడి వైద్యులు సాహసించిఆపరేషన్ చేశారు. వందలాది రాళ్లను బయటకు తీశారు. ప్రస్తుతం ఈఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెగ ట్రోల్ అవుతోంది.