https://oktelugu.com/

Divvela Madhuri : దివ్వెల మాధురికి కారు యాక్సిడెంట్.. ఆత్మహత్యాయత్నం అంటూ పుకార్లు.. ఎమ్మెల్సీ దువ్వాడ వివాదంలో మరో ట్విస్ట్..

గత నాలుగు రోజులుగా తెలుగు మీడియాకు దువ్వాడ ఫ్యామిలీ వివాదం అనుకోని వరంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆయన భార్య, పిల్లలుపోరాటానికి దిగారు. ఈ క్రమంలో రకరకాల ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : August 11, 2024 5:50 pm
    Divvela Madhuri, Duvvada Srinivas

    Divvela Madhuri, Duvvada Srinivas

    Follow us on

    Mlc duvvada sreenivas : ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్. ఆయన స్నేహితురాలు దివ్వెల మాధురి ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో గాయపడ్డారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నమా? లేకుంటే ప్రమాదమా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆమె తీవ్ర డిప్రెషన్ కు గురైనట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు అంటూ ఆమె భార్య వాణి తో పాటు ఇద్దరు పిల్లలు ఆరోపిస్తున్నారు. ముందుగా ఇద్దరు కుమార్తెలు తండ్రి కోసం ఇంటికి వెళ్ళగా… గేట్లు వేసి లోపల తాళం వేశారు. ఇంటి లైట్లు కూడా ఆపివేశారు. ఈ తరుణంలో గంటల పాటు అక్కడే వేచి చూసిన దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు వెనుదిరిగారు. ఆ మరుసటి రోజు దువ్వాడ వాణి తన ఇద్దరు కుమార్తెలతో మీడియా ముందుకు వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధాన్ని ప్రస్తావించారు. అదే రోజు రాత్రి దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో దువ్వాడ వారిపై దాడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. దువ్వాడ వాణి తన ఇద్దరు కుమార్తెలతో అక్కడే బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి మీడియాతో మాట్లాడారు. వాణి కారణంగానే తాను దువ్వాడ శ్రీనివాస్ కు దగ్గర అయ్యానని చెప్పుకొచ్చారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ స్నేహితుడని, గైడ్ అని చెప్పారు. తనకు కుటుంబం ఉందని… దువ్వాడ శ్రీనివాస్ కు కుటుంబం ఉందని.. ఆయన ఇంకా విడాకులు ఇవ్వలేదని.. అయినా సరే ఆయనతో తాను కలిసే ఉంటానని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు.

    * దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ ఇలా..
    మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.30 సంవత్సరాల పాటు భార్య వాణి తనకు నరకం చూపించారని చెప్పారు.కనీస గౌరవం ఇవ్వకుండా.. తన తల్లి, సోదరులకు సైతం ఇబ్బంది పెట్టేవారని గుర్తు చేశారు. ఆమెకు విడాకులు ఇస్తానని కూడా తేల్చి చెప్పారు. తన ఇద్దరి పిల్లల సంరక్షణ తానే చూసుకుంటానని కూడా శ్రీనివాస్ ప్రకటించడం విశేషం. తన భార్య వాణి రాజకీయ ఆధిపత్యంతో వ్యవహరించారని… తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని.. ఆమె వెనుక టిడిపి ఎమ్మెల్యే ఉన్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

    * మాధురికి అన్యాయం జరిగింది
    దివ్వెల మాధురి కోసం ప్రస్తావిస్తూ.. తన కుటుంబం కోసం ఆమె అన్యాయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య వాణి మాధురిని పరిచయం చేశారని.. ఆమె వైసీపీలో చేరి మెరుగైన సేవలు అందించారని కూడా గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో రెండు కోట్ల రూపాయల మేర సాయం కూడా చేశారని చెప్పుకొచ్చారు. భార్యా పిల్లలపై దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా.. దువ్వాడ పై ఆయన భార్య వాణి ఫిర్యాదు చేశారు. మరోవైపు తన పేరును ప్రస్తావిస్తూ వీధిన పడేసారంటూ దివ్వెల మాధురి దువ్వాడ వాణిపై సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.

    * మనస్థాపంతోనే ఈ ఘటన?
    అయితే గత నాలుగు రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం పైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మీడియాలో కూడా ఇదే ప్రధాన అంశంగా మారింది. ఇంకోవైపు దివ్వెల మాధురి వీడియోలతో పాటు రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని టోల్ గేటు వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా ఉన్న కారును తన వాహనాన్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఆ సమయంలో ఆమె జూమ్ కాల్ లో మాట్లాడుతున్నారు. అయితే అది ప్రమాదమా? లేక ఆత్మహత్యాయత్నమా? అన్నది తెలియాల్సి ఉంది.