MLC Duvvada Srinivas : ఇల్లీగల్ గా పెళ్లిచేసుకుంటే తప్పు గానీ, కలిసి ఉంటే కాదు.. దువ్వాడతో బంధంపై మాధురి మాట

వివాహ వ్యవస్థ గురించి.. ఆలుమగల సంబంధాల గురించి చాలా రకాలుగా వింటాం. కల్లారా చూస్తాం కూడా. అయితే అది నైతికమా? కాదా? అన్నది సదరు వ్యక్తులు గ్రహించాల్సిన అంశం.

Written By: NARESH, Updated On : August 11, 2024 7:03 pm

MLC Duvvada Srinivas

Follow us on

Mlc Duvvada : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారమే చర్చకు దారితీస్తోంది. ఏ ఇద్దరు కలిసిన ఇదే హాట్ టాపిక్ గా మారింది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపిస్తున్నారు. తమ తండ్రి తమకు కావాలని కుమార్తెలు డిమాండ్ చేస్తున్నారు. అనైతికంగా ఓ మహిళతో కలిసి ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. తన 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో భార్య తనకు విలువ ఇవ్వలేదని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. ఇప్పటివరకు తాను సంపాదించినది, తన ఆస్తిపాస్తులను భార్యతో పాటు కుమార్తెలకు ఇచ్చానని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. తన భార్య వాణికి విడాకులు ఇస్తానని.. పిల్లల సంరక్షణ మాత్రం తాను చూస్తాననిమీడియా సమావేశం పెట్టి మరి దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తమ కుటుంబం వల్ల దివ్వెల మాధురి అన్యాయమైపోయారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మాధురి తనను అనవసరంగా వీధిన పడేశారని.. తనకు దువ్వాడ శ్రీనివాస్ ఒక గైడ్, ఒక ఫ్రెండ్ మాత్రమేనని తేల్చి చెప్పారు. తమ మధ్య ఉన్నది వివాహేతర సంబంధం కాదని.. స్నేహం మాత్రమేనని ఆమె చెబుతున్నారు. ఈ ట్రయాంగిల్ వ్యవహారం మీడియాకు ఒక ప్రధాన వస్తువుగా మారిపోయింది. నిత్యం టీవీ ఛానల్ లో ఇదే అంశంపై డిబేట్ లు కొనసాగుతున్నాయి. వివాహేతర సంబంధం అని ఒక్కరు.. కాదు స్నేహం అని మరొకరు.. ఎంత జరిగాక భార్యకు విడాకులు ఇంకొకరు.. ఇలా సీరియల్ ఎపిసోడ్ లా ఇది కొనసాగుతోంది.

* సోషల్ మీడియాలో హల్ చల్
మరోవైపు దివ్వెల మాధురి వీడియోలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఆమె వివిధ పాటలకు డాన్స్ చేస్తూ తీసిన రీల్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సినిమా స్టార్ మాదిరిగా అభినయిస్తూ ఆమె వీడియోలు ఉన్నాయి. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మధ్యలోటీవీ ఛానల్ లకు, యూట్యూబ్ లకు ఇస్తున్న ఇంటర్వ్యూలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె చేస్తున్న కామెంట్స్ సైతం హైలెట్ అవుతున్నాయి.

* ఆ బంధం ప్రత్యేకం
దువ్వాడ శ్రీనివాసుతో అడల్టరీ బంధంతో ఉన్నట్లు దివ్వెల మాధురి చెప్పుకొస్తున్నారు. మీడియా ముందు కూడా ఇదే వాదిస్తున్నారు. అడల్టరీ అంటే శారీరక సంబంధం. ఇదేమి తప్పు కాదని ఆమె వాదన. సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆమె చెబుతోంది. పెళ్లి కాని వాళ్ళు చేస్తే సహజీవనం అని.. పెళ్లయిన వాళ్లు చేస్తే అడల్టరీ అని ఆమె సమర్థించుకుంటున్నారు. అయితే ఆమె చెబుతున్నది కూడా నిజమే. వివాహితుడైన వ్యక్తి.. వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం అడల్టరి. ఇది శిక్షారహమైన నేరం కాదని సుప్రీంకోర్టు 2018లో తీర్పు కూడా ఇచ్చింది. ఇప్పుడు దానినే గుర్తు చేస్తున్నారు దివ్వెల మాధురి.

* సుప్రీం తీర్పు అలా
అయితే అదే సమయంలో సుప్రీంకోర్టు మరోలా అభివర్ణించింది. అది వివాహ వ్యవస్థను ముగింపు పలికే తప్పుడు సరిగా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు దివ్వెల మాధురి చెబుతోంది చట్టపరంగా మాత్రమే. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి. ప్రజాక్షేత్రంలో ఉన్నారు. పైగా ఇరువురికి కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నారు. సమాజానికి వీరు తప్పకుండా సమాధానం చెప్పాలి. అయితే ఇవన్నీ తనకు అవసరం లేదని.. తనకు మంచి స్నేహితుడు దువ్వాడ శ్రీనివాస్ అని మాధురి చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.